WhatsApp Recharge: ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. భారత్‌లోని తమ యూజర్లు వాట్సాప్ యాప్‌లోనే చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ సదుపాయాన్ని అందించేందుకు పేయూతో వాట్సాప్ జతకట్టింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యూజర్లకు ఈ కొత్త ఫీచర్ దశల జియో, వీఐ, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ ఇలా ఏ నెట్‌వర్క్ వినియోగదారులైనా సంబంధిత ప్లాన్ ఎంచుకుని ఈజీగా పేమెంట్ చేయవచ్చని తెలిపింది. భారత్‌లోని తమ యూజర్లు రోజువారీ టాస్కులను చాలా ఈజీగా పూర్తి చేసేందుకు వీలుగా మొబైల్ రీఛార్జి సదుపాయాన్ని సైతం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మెటా ఇండియా డైరెక్టర్ రవి గార్గ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మొబైల్ రీఛార్జి కోసం వేరు వేరు యాప్ లపైన ఆధారపడకుండా వాట్సాప్ యాప్ లోనే రీఛార్జ్ ఎంపిక చేసుకుని పేమెంట్ కూడా చేసే వెసులుబాటును తెచ్చామని వెల్లడించారు. దీంతో పాటు రూపీ సింబల్ ను కూడా హోమ్ స్క్రీన్ లో కనిపించేలా వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. వాట్సాప్ లో రీఛార్జ్ ప్రాసెస్ ఇదేవాట్సాప్ లో మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయాలంటే మొదటగా రూపీ సింబల్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆప్షన్ కనిపిస్తుంది దానిని ఎంచుకోవాలి. అందులో మీ ఫోన్ నంబర్ లేదా మీరు రీఛార్జ్ చేయాల్సిన నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆపరేటర్‌ను ధ్రువీకరించుకున్నాక మీకు నచ్చిన మొబైల్ రీఛార్జి ప్లాన్ ఎంచుకోవాలి. యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సాయంతో పేమెంట్లు చేయవచ్చు. వాట్సాప్ లో ఇప్పటికే యూపీఐ పేమెంట్లు, మెట్రో టికెట్ బుకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ యూపీఐతోనూ పేమెంట్లు చేయవచ్చు. లేదా మీకు నచ్చిన యూపీఐ ఐడీతో రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని కోసం యూజర్లు వేరే థర్డ్ పార్టీ యాప్స్ లేదా వెబ్ సైట్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సాప్ పేమెంట్స్ విభాగంలో లేదా జియో, ఎయిర్ టెల్ వంటి కంపెనీల అధికారిక చాట్ బాట్ ద్వారానూ రీఛార్ చేయవచ్చు. యూజర్లు తమ నంబర్ అందుబాటులో ఉన్న వివిధ ప్లాన్లను చూసి నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. వాట్సాప్ యూపీఐ ద్వారా పేమెంట్ సురక్షితంగా ఉంటుందని చెప్పవచ్చు. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లందరికీ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త ఫీచర్ ద్వారా సమయం ఆదా అవడంతో పాటు చాటింగ్ చేస్తూనే అత్యంత వేగంగా మొబైల్ రీఛార్జ్ పూర్తి చేయవచ్చు.