ఫెడ్ ప్రకటనకు ముందు బంగారం ధరల్లో మార్పు.. భారీగా తగ్గి ఒక్కసారిగా ఇలా.. తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Wait 5 sec.

Latest Gold Silver Rates: అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై క్లారిటీ లేదు. మరోవైపు.. హార్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. దీంతో ఇరాన్‌కు తీరని నష్టం వాటిల్లుతున్నట్లు భావిస్తోంది. యుద్ధం చేయడం.. సైనిక చర్యలు తీసుకోవడంతో పోలిస్తే.. ఇలా ఇరాన్ నౌకల్ని కదలనీయకుండా చేసి.. ఆ దేశ ఎగుమతులపై దెబ్బకొట్టాలన్న అమెరికా ప్లాన్ వర్క్ అవుట్ అయినట్లే తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరాన్.. ఎలాంటి ప్రతిచర్యలకు పాల్పడుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే యుద్ధం ముగింపుపై స్పష్టత కొరవడిన క్రమంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 3 వారాల గరిష్ఠ స్థాయికి ఎగబాకగా.. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు ప్రస్తుతం 111 డాలర్ల వద్ద ఉంది. ఇదే సమయంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో మంగళ- బుధవారాల్లో భారీగా తగ్గి.. మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కిందటి రోజు మాత్రం భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4600 డాలర్ల స్థాయిలో ఉంది. కిందటి రోజు ఒక దశలో ఇది 4570 డాలర్లకు పడిపోయింది. సిల్వర్ రేటు 75 డాలర్ల నుంచి ఒక దశలో 72 డాలర్లకు దిగొచ్చినా మళ్లీ ప్రస్తుతం 74 డాలర్ల స్థాయిలో ఉంది. దేశీయంగా కిందటి రోజు బంగారం ధర భారీగా దిగొచ్చినా.. ఏప్రిల్ 29న ఉదయం 10 గంటల సమయంలో మళ్లీ పెరిగింది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 400 పెరగ్గా 10 గ్రాములకు రూ. 1,38,750 వద్ద ఉంది. కిందటి రోజు రూ. 2550 తగ్గగా దానికి ముందు రూ. 300 పతనమైంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 440 పెరిగి ప్రస్తుతం తులం రూ. 1,51,370 వద్ద ఉంది. ఇది ముందటి రోజు రూ. 2,780 మేర తగ్గింది. మరోవైపు వెండి ధర మాత్రం హైదరాబాద్ మార్కెట్లో స్థిరంగానే ఉంది. కేజీకి రూ. 2.65 లక్షల వద్ద కొనసాగుతోంది. కిందటి రోజు రూ. 5 వేలు తగ్గింది. ఫెడ్ ప్రకటనపై అంతటా ఆసక్తి..>> యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం (FOMC) ఏప్రిల్ 28-29 తేదీల్లో జరగనుండగా.. బుధవారం అర్ధరాత్రి సమయంలో వడ్డీ రేట్లపై ప్రకటన రానుంది. . దీంతో ఈసారి ఆయన వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో.. పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. ఇది వడ్డీ రేట్లను గరిష్ఠ స్థాయిల్లోనే ఉంచేలా చేస్తుంది. అంటే వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తేనే.. బంగారం ధరలు పెరుగుతుంటాయి. దీంతో.. ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లను పెంచినా.. స్థిరంగా ఉంచినా.. బంగారం ధరలు మరింత దిగొచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.