విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, గూగుల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం తర్వాత జరిగిన సభలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మొబైల్‌ కేంద్రమంత్రి ఆకర్షించింది. వెంటనే చంద్రబాబు దగ్గర ఫోన్‌ను అశ్వినీ వైష్ణవ్ తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. చంద్రబాబును అడిగి ఏ మోడల్, ఈ ఫోన్‌లో ఏ, ఏ ఫీచర్లు ఉన్నాయో ఆరా తీశారు. చంద్రబాబు ఫోన్ గురించి కేంద్రమంత్రికి వివరించారు. అశ్వినీ వైష్ణవ్ చంద్రబాబును ఫోన్‌ను కొద్దిసేపు అలా తీక్షణంగా చూసి వివరాలు అడిగి మరీ తెలుసుకోవడం విశేషం.కేంద్రమంత్రి చంద్రబాబు ఫోన్ గురించి ఆరా తీయడంతో.. ఇంతకీ అది ఏ ఫోన్ అని అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం కొత్త ఫోల్డబుల్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్నారు.. అయితే ఏ కంపెనీ, ధర ఎంత అనేది క్లారిటీ లేదు. అయితే కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మాత్రం ఈ మొబైల్ ఆకర్షించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు ఉపయోగిస్తున్న ఫోన్‌ను ఫోల్డ్ చేసుకునే సౌకర్యం ఉంది.. చూడటానికి కాస్త వెరైటీగా ఉండటంతోనే అశ్వినీ వైష్ణవ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఫోన్ గురించి AI ద్వారా ఆరా తీస్తే.. ఆయన Samsung Galaxy Z Fold 6 మొబైల్ ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఈ మొబైల్ ధర రూ.లక్షా50వేల నుంచి రూ.లక్షా 75 వే వరకు ఉండొచ్చని చెబుతున్నారు.ఈ సభలో . చంద్రబాబు దేశం గర్వించే విజనరీ లీడర్ అంటూ పొగడ్తలు కురిపించారు. గతంలో ఆయన సైబరాబాద్ నిర్మించారని.. హైదరాబాద్‌లో సైబర్ టవర్ ఐటీ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చంద్రబాబు ఆధ్వర్యంలో మారుతుందని.. రాబోయే రోజుల్లో ఐటీపట్నం కాబోతోందన్నారు. ఓవైపు ప్రధాని మోదీ, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌లకు సెల్యూట్ చేస్తున్నాను అన్నారు. ఏపీకి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని.. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు కేటాయిచాంమన్నారు అశ్వినీ వైష్ణవ్.