మారుతీ బంపరాఫర్.. 3 నెలల్లోనే 6 లక్షలకుపైగా కార్ సేల్స్.. ఒక్కో షేరుకు రూ. 140 డివిడెండ్!

Wait 5 sec.

: ప్రముఖ కార్ల తయారీ సంస్థ.. అతిపెద్ద ప్యాసింజర్ కార్‌మేకర్ మారుతీ సుజుకీ ఇండియా..2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి- మార్చి) ఫలితాల్ని వెల్లడించింది. మంగళవారం సెషన్‌లో స్టాక్ మార్కెట్ ముగిసే సమయంలో ఫలితాలు విడుదల చేయగా.. ఆఖరి త్రైమాసికంలో సంస్థ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ. 3,659 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో లాభం రూ. 3,911.1 కోట్లుగా ఉండగా.. 6.5 శాతం వరకు తగ్గడం గమనార్హం. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం సమీక్షా త్రైమాసికంలో రూ. 52,462.5 కోట్లుగా వచ్చింది. ఇది అంతకుముందుతో పోలిస్తే సుమారు 28 శాతానికిపైగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఆదాయం కేవలం రూ. 40,910 కోట్లుగానే ఉండేది. >> ఇక గత ఆర్థిక సంవత్సరంలో మొత్తానికి చూస్తే కార్ల విక్రయాలు భారీగా పెరిగినప్పటికీ.. లాభాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ నిర్వహణేతర లాభాలు తగ్గడం సహా బాండ్ రాబడులు క్షీణించడం కూడా ప్రభావం చూపిందని సంస్థ తెలిపింది. సేల్స్ విషయానికి వస్తే.. పూర్తి ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ కార్ల విక్రయాలు 24,22,713 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇందులో 19,74,939 యూనిట్లను దేశీయంగా విక్రయించగా.. 4,47,774 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇక్కడ సేల్స్ భారీగానే పెరిగాయి. ఒక త్రైమాసికంలో రికార్డు స్థాయి సేల్స్..జనవరి- మార్చి త్రైమాసికంలో చూస్తే ఏకంగా 6,76,209 యూనిట్లను విక్రయించగా.. ఒక త్రైమాసికంలో సంస్థకు ఇదే అత్యధికం కావడం విశేషం. దీంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతకుముందు ఇదే సమయంతో పోలిస్తే సేల్స్ ఏకంగా 11 శాతానికిపైగా పెరిగాయి. వీటి విలువ రూ. 50 వేల కోట్లకుపైనే ఉంటుందని తెలిపింది. . డివిడెండ్ ప్రకటన..ఫలితాల సమయంలోనే షేర్ హోల్డర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది మారుతీ సుజుకీ. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 140 చొప్పున ఫైనల్ డివిడెండ్ చెల్లించనున్నట్లు తెలిపింది. దీనికి ఆగస్ట్ 7 రికార్డ్ డేట్‌గా పేర్కొంది. అంటే ఈ తేదీలోపు మారుతీ సుజుకీ షేర్లను కలిగి ఉన్న వారికి డివిడెండ్ వస్తుందన్నమాట. 10 షేర్లు ఉంటే.. రూ. 1400 వస్తుంది. 100 షేర్లు ఉంటే.. రూ .14 వేలు వస్తాయి. ఇవి నేరుగా షేర్ హోల్డర్ అకౌంట్లోనే జమవుతాయి. ఇక సెప్టెంబర్ 9 లోపు డివిడెండ్ చెల్లింపులు చేస్తామని ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది. పడిపోయిన మారుతీ సుజుకీ షేర్ ధర..ఏప్రిల్ 28న మార్కెట్ క్లోజింగ్ సమయంలో ఫలితాలు రాగా.. మారుతీ సుజుకీ షేరు ఒడుదొడుకులకు లోనైంది. 2.51 శాతం పతనమై రూ. 12,890 వద్ద స్థిరపడింది. సంస్థ మార్కెట్ విలువ రూ. 4.05 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 17,370 గా ఉండగా.. కనిష్ఠ ధర రూ. 11,289 గా ఉంది.