ఇదీ అసలైన స్టాక్.. నెలలోనే 88 శాతం పెరిగిన షేరు.. ఆరేళ్లలోనే లక్షకు రూ. 98 లక్షలొచ్చాయ్!

Wait 5 sec.

: భారత స్టాక్ మార్కెట్ సూచీలు కొంత కాలంగా ఒడుదొడుకులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గతేడాది అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మార్కెట్లను పడేస్తున్నాయి. . ఏప్రిల్‌లో కిందామీద పడుతున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అయినప్పటికీ మార్కెట్లు భారీగా పడుతున్నా కూడా ఒక స్టాక్ మాత్రం దూసుకెళ్తోంది. వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్లు కొడుతూనే ఉంది. అదే వెబ్‌సోల్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్. స్వల్ప కాలంలో అదే విధంగా లాంగ్ రన్‌లో కూడా ఇది మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఇన్వెస్టర్లకు స్థిరంగా.. నిలకడగా లాభాలు అందిస్తూ వచ్చింది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి అనేది రిస్క్‌కు లోబడి ఉన్నప్పటికీ.. ఆర్థిక నిపుణుల సలహాతో ఆయా కంపెనీల ఫలితాలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రణాళికలు అన్నీ గమనిస్తూ.. సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకుంటే మంచి రాబడి అందుకోవచ్చు. దీన్నే నిరూపించిందీ స్టాక్. ఈ స్టాక్ ధర 2020 ఏప్రిల్ సమయంలో రూ. 1.25 వద్ద ఉండేది. అప్పుడు పెన్నీ స్టాక్‌గా ఉండేది.. ఈ క్రమంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ. 122 పైనే ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మార్కెట్ ఒడుదొడుకుల్లోనూ ఈ స్టాక్ రాణిస్తుండటం విశేషం. గత 5 రోజుల్లోనే వరుస అప్పర్ సర్క్యూట్లతో ఏకంగా 30 శాతం పెరిగింది. వారంలో 38 శాతం దూసుకెళ్లింది. నెల వ్యవధిలో రికార్డు స్థాయిలో 88 శాతం పుంజుకుంది. ఈ క్రమంలో షేరు ధర రూ. 65 స్థాయి నుంచి రూ. 122 కు ఎగబాకింది. ఈ క్రమంలో లక్ష పెట్టుబడిని నెలలోనే రూ. 1.88 లక్షలు చేసిందన్నమాట. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూస్తే సుమారు 38 శాతం పెరిగాయి. ఏడాది వ్యవధిలో మాత్రం 10 శాతానికిపైగా పడిపోయాయి. మూడేళ్లు, ఐదేళ్లు, ఆరేళ్ల వ్యవధిలో ఈ స్టాక్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఈ క్రమంలో మూడేళ్లలో 1295 శాతం, ఐదేళ్లలో 2800 శాతానికిపైగా రాబడి అందించింది. ఆరేళ్లలో చూస్తే అంతకంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగా.. ఇక్కడ లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఆరేళ్లలో ఏకంగా రూ. 98 లక్షలు రావడం విశేషం. లక్ష పెట్టుబడిని మూడేళ్లలో రూ. 14 లక్షలు చేసింది. ఇటీవల సంస్థ క్యూ4 ఫలితాల్ని ప్రకటించగా.. నికర లాభం ఏకంగా 157 శాతం పెరిగి రూ. 125 కోట్లుగా నమోదైంది. ఆదాయం 132 శాతం పెరిగి రూ. 401 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలోనే షేర్ ధర మళ్లీ వరుసగా పెరుగుతోంది. గమనిక: పైన ఇచ్చింది సమాచారం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. అప్పుడే రిస్క్ లేకుండా లాభాలు అందుకోవచ్చు.