ఏపీ పదోతరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాల విడుదలకు డేట్ ఫిక్స్!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‍లో పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్య గమనిక. టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను గురువారం (ఏప్రిల్ 30) రోజున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరీక్షల విభాగం ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రాసెస్‌ను పూర్తి చేసింది. టెన్త్ విద్యార్థులు వారి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ నంబర్‌తో , ద్వారా ఫలితాలను పొందవచ్చు. అలాగే పదోతరగతి విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు పొందొచ్చు. అదనంగా ‘LEAP’ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షల్ని 6.30 లక్షలమంది విద్యార్థులు రాశారు.పదోతరగతి విద్యార్థులు ఫలితాలను వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ముందుగా bse.ap.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి హోమ్ పేజీలో "AP SSC Results 2026" అనే ట్యాబ్‌ను సెలక్ట్ చేయాలి. అక్కడ విద్యార్థులు వారి రోల్ నంబర్ (Roll Number) నమోదు (Enter) చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయగానే విద్యార్థుల మార్కులు, గ్రేడ్లు కనిపిస్తాయి. స్క్రీన్ మీద ఉన్న Print ఆప్షన్ ద్వారా మార్కుల జాబితాను సేవ్ చేసుకోవచ్చు. మరోవైపు పరీక్ష ఫలితాలు విడుదలైన సమయంలో వెబ్‌సైట్‌ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. విద్యార్థులు మన మిత్ర వాట్సాప్ ద్వారా, LEAP మొబైల్ యాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా ఆప్షన్స్ సెలక్ట్ చేసుకుని.. హాల్ టికెట్ నంబర్ పంపితే మార్కుల వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి.ఏపీ ప్రభుత్వం మార్కులకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది.. ఈ ఏడాది ట్యాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థుల ఆన్సర్ షీట్లు వాల్యూషన్ చేసిన తర్వాత మార్కులను కౌంట్ చేసి పేపర్ రికార్డుల్లో నమోదు చేయడంతో పాటుగా ట్యాబ్‌లలో కూడా వెంటనే అప్లోడ్ చేస్తున్నారు.