: సాధారణగా న్యాయస్థానాలకు వెళ్తే సంవత్సరాల కొద్దీ వేచి చూడాల్సి వస్తుందని చాలా మంది భయపడుతుంటారు. కోర్టులు కూడా విచారణ చేపట్టేందుకే చాలా సమయం తీసుకుంటాయి. ఇక విచారణ మొదలయ్యాక.. కేసును వాయిదాలు వేస్తూ చాలా సంవత్సరాలు పొడగిస్తుంటాయి. ఇదంతా మనకు తెలిసిందే కాగా.. పదేళ్ల నాటి ఓ పరువు నష్టం దావా కేసులో న్యాయం పొందాల్సిన వారే రాజీ పడబోమని తేల్చి చెప్పారు. దీంతో కేసును ఇంకా సాగిదీస్తూ.. కోర్టు సమయం వృథా చేస్తున్నారంటూ 90 వృద్ధురాలిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె రాజీకి నిరాకరించిందనే కోపంతో ఆ కేసును ఏకంగా 20 ఏళ్లకు అంటే 2046వ సంవత్సరానికి వాయిదా వేసింది. అసలేం జరిగిందంటే..?దక్షిణ ముంబైలోని మలబార్ హిల్‌కు చెందిన ప్రముఖ గుజరాతీ రచయిత్రి, 90 ఏళ్ల తరిణిబెన్ దేశాయ్, ఆమె కుమార్తె 57 ధ్వని దేశాయ్ తమ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులపై 2017లో రూ. 20 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సొసైటీ నిర్వహణ ఖర్చుల విషయంలో వీరు ప్రశ్నించగా.. కమిటీ సభ్యులు వీరిని బకాయిదారులు అని పిలిచారని.. దాని వల్ల తమ పరువు పోయిందని వారు కోర్టును ఆశ్రయించారు. అయితే కేసును త్వరితగతిన ముగించాలని భావించిన జస్టిస్ జితేంద్ర జైన్ కమిటీ సభ్యులు.. హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు బేషరతుగా క్షమాపణ చెబితే కేసును ముగించాలని పిటిషనర్లకు సూచించారు. కమిటీ సభ్యులు కూడా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమయ్యారు. అయితే సదరు వృద్ధురాలు మాత్రం క్షమాపణను అంగీకరించబోనని.. చట్టపరంగానే తేల్చుకుంటానని పట్టుబట్టారు.జీవిత చరమాంకంలో కూడా ఆహమా..?వృద్ధురాలి తీరుపై జస్టిస్ జితేంద్ర జైన్ తీవ్రంగా స్పందించారు. "జీవితం చివరి అంకంలో ఉండి కూడా అహానికి పోయి ఇలాంటి కేసులతో వ్యవస్థను స్తంభింపజేస్తున్నారు. దీనివల్ల అత్యవసరమైన మిగతా కేసులను విచారించకుండా కోర్టు సమయం వృథా అవుతోంది. అందుకే ఈ కేసును 2046వ సంవత్సరానికి వాయిదా వేస్తున్నాం. అప్పటి వరకు ఈ కేసును విచారణకు తీసుకో వద్దు. వీరు సీనియర్ సిటిజన్లు అనే కారణంతో ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు" అని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణంగా సీనియర్ సిటిజన్ల కేసులకు కోర్టులు ప్రాధాన్యత ఇస్తుంటాయి. కానr అవతలి పక్షం రాజీకి సిద్ధంగా ఉన్నా.. కేవలం పంతంతో కోర్టు మెట్లు ఎక్కడం వల్ల వ్యవస్థపై భారం పడుతోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు ఇప్పుడు న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.