ఢిల్లీలో 8వ పే కమిషన్ మీటింగ్.. పాత పెన్షన్ పునరుద్ధరణ, డెడ్‌లైన్ పెంపు సహా ఉద్యోగుల కీలక డిమాండ్లివే..!

Wait 5 sec.

NCJCM meeting: ఉద్యోగులకు సంబంధంచిన ప్రతిపాదనలతో మెమోరాండం సమర్పణకు గడువును మే 31, 2026 వరకు పొడిగించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరారు. అలాగే వివిధ ఉద్యోగ సంఘాలకు ప్రత్యేక సమావేశ సమయాలు కేటాయించడం, వాటా అవసరం లేని పింఛను పథకాన్ని (పాత పింఛను పథకం) పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలలో వ్యక్తిగత పర్యటనలు చేయాలని సూచించారు. ఢిల్లీ కేంద్రంగా మంగళవారం ఏప్రిల్ 28, 2026 రోజున నేషనల్ కౌన్సిల్–జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM), 8వ పే కమిషన్ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో కీలక అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.ఏప్రిల్ 28, 2026 తేదీ రోజున జరిగిన సమావేశంలో పాల్గొన్న వారిలో ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AIDEF) కార్యదర్శి సి శ్రీకుమార్ NC-JCM కార్యదర్శి శివ్ గోపాల మిశ్రా నేతృత్వంలోని ప్రతినిధి బృందం, 8వ పే కమిషన్ ఛైర్‌ పర్సన్ రంజనా ప్రకాష్ దేశాయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతి ముఖ్యమైన అంశాన్ని హైలైట్ చేశారు. వినతిపత్రం సమర్పించే గడువును ఏప్రిల్ 30, 2026 నుంచి మే 31, 2026 వరకు పొడిగించాలని NC-JCM 8వ వేతన సంఘం ఛైర్‌పర్సన్‌ను కోరింది. అనేక ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు తమ వినతిపత్రాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించలేకపోతున్నందున, గడువు పొడిగింపు అవసరమైందని ఉద్యోగ సంఘం తెలిపింది. ఉద్యోగ సంఘాల నుంచి వినతిపత్రాన్ని PDF, MS Word ఫార్మాట్లలో కూడా స్వీకరించాలని NC-JCM అభ్యర్థించింది. పునరుద్ధరించాలని NC-JCM చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. బుధవారం జరిగిన సమావేశంలో ఈ డిమాండ్‌ను అది పునరుద్ఘాటించింది. 8వ సీపీసీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ (ToR)లో ఇచ్చిన అన్‌ఫండెడ్ పెన్షన్ అనే పదం సరైనది కాదని పేర్కొంది. ఎందుకంటే, నాన్-కాంట్రిబ్యూటరీ పెన్షన్ ప్రవేశపెట్టడానికి ముందు, ప్రభుత్వం వాటా అందిస్తున్న కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌ను ఉద్యోగులు వదులుకుని, పెన్షన్ స్కీమ్‌ను ఎంచుకున్నారని తెలిపింది. ఉద్యోగుల కనీస వేతనాల రూ.1.69 లక్షల వరకు ఇవ్వాలని, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.83 వరకు ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జనవరి 1 నుంచే అన్ని బకాయిలు చెల్లించాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో 8వ పే కమిషన్ ఉద్యోగ సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ పర్యటిస్తామని, అప్పుడు తమ డిమాండ్లు తెలపాలని ఉద్యోగ సంఘాలకు పే కమిషన్ సూచించింది.