పశ్చిమ్ బెంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. రెండు దశల్లో పోలింగ్ నిర్వహించగా.. చివరి విడత బుధవారం జరిగింది. అధికార , బీజేపీల మధ్య హోరాహోరీగా పోరు సాగడంతో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను వెల్లడించాయి. కొన్ని సర్వేలు బీజేపీకి.. మరికొన్ని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు మొగ్గు ఉన్నట్టు పేర్కొన్నాయి. అయితే, ఇరు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉందని తెలిపాయి.పీపుల్స్ పల్స్ సర్వే టీఎంసీకి 177 నుంచి 187, బీజేపీకి 95-110 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. మ్యాట్రిజ్ సర్వే టీఎంసీ 125 నుంచి 140, బీజేపీ 146-161 చోట్ల విజయం సాధిస్తుందని పేర్కొంది. అయితే, పీ-మార్క్‌ సర్వే మాత్రం టీఎంసీ 118-138, బీజేపీ 150-175 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. చాణక్య స్ట్రాటజీస్‌ కూడా బీజేపీకి ఛాన్స్ ఉందని వెల్లడించింది. బీజేపీకి 150-160 స్థానాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌‌కు 130-140 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. పోల్ డెయిరీ కూడా కమలం వికసిస్తుందని అంచాన వేసింది. టీఎంసీకి 99 నుంచి 127, బీజేపీకి 142 నుంచి 171, కాంగ్రెస్ 3 నుంచి 5 స్థానాల్లో విజయం సాధిస్తాయని చెప్పింది. జన్మత్ 195 నుంచి 205 స్థానాలు టీఎంసీకి, 80 నుంచి 90 స్థానాలు బీజేపీకి వస్తాయని అంచనా వేసింది.