‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ : తల్లి కాబోతున్న వల్లి.. ఇది డ్రామా కాదు నిజంగానే.. ‘సాధించావ్ రా పెద్దోడా.. రామరాజు సంబరం’

Wait 5 sec.

చందుకి యాక్సిడెంట్ చేయించింది భాగ్యం, శ్రీవల్లేనని ఆ లారీ డ్రైవర్ ధీరజ్, నర్మదల దగ్గర నిజం చెప్పేయడంతో కథ మలుపు తిరిగింది. అత్తారింట్లో అడుగుపెట్టడం కోసం.. కట్టుకున్న వాడినే చంపేయాలని చూస్తావా? అంటూ నర్మద, ప్రేమలు.. శ్రీవల్లిని ఉతికి ఆరేస్తాడు. భాగ్యం చెంప పగలకొడతారు. నాకు ఏం పాపం తెలియదు.. మేం ప్రాణాలు తీసేటంత దుర్మార్గులం కాదు.. మేం డమ్మీ యాక్సిడెంట్ చేయమని మాత్రమే చెప్పాం అని శ్రీవల్లి ఎంత మొత్తుకున్నా కూడా నర్మద, ప్రేమ, ధీరజ్‌లు వినిపించుకోరు. దయచేసి నా మాట నమ్మడం.. నిజంగా నేను బావని చంపాలనుకోలేదు అంటూ నర్మద, ప్రేమల కాళ్లపై పడి కన్నీటిపర్యంతం అవుతుంది శ్రీవల్లి. నీలాంటి దాన్ని నమ్మడం అంటే.. పాముని పక్కన పెట్టుకోవడమే.. నీ గురించి మామయ్యతో చెప్తాం అంటూ నర్మద, ప్రేమలు వెళ్తుంటారు. ఇంతలో శ్రీవల్లి.. కన్నీటిపర్యంతం అవుతూ.. కళ్లు తిరిగిపడిపోతుంది. ఇంతలో చందు కూడా హాస్పిటల్‌కి వస్తాడు. ఏమైందని కంగారు పడకుండా.. ‘వీళ్లు పెద్ద కంత్రీలు అని తెలిసినా కూడా.. వీళ్ల డ్రామాలను నమ్ముతున్నారా? కళ్లు తిరిగిపడిపోయిందని కొత్త నాటకం ఆడుతున్నారు.. ఇందాకే కదా కప్పులు కడుగుతున్నట్టుగా నాటకం ఆడిందీ.. ఇంతలోనే కళ్లు తిరిగిపడిపోయేటంత రోగం వచ్చేసిందా? నా దగ్గర కాదు మీ నాటకాలు? అని అంటాడు చందు. దాంతో భాగ్యం.. డ్రామాలు కాదు అల్లుడూ.. నిజంగానే కళ్లు తిరిగిపడిపోయింది అని అంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి.. ‘ఏంటయ్యా డ్రామాలంటావ్.. డ్రామాలాడటానికి అదే కాలు నొప్పో కడుపు నొప్పో కాదు. తను ప్రెగ్నెంట్ అని అంటుంది డాక్టర్. ఆ మాటతో ఒక్కసారిగా అందరి మొహాల్లో ఉన్న కోపం, పగలు పక్కకిపోయి.. చిరునవ్వులు విరబూస్తాయి. ‘వల్లీ తల్లి కాబోతుంది.. తను నెల తప్పింది అని డాక్టర్ అనగానే.. భాగ్యం ఎగిరిగంతేస్తుంది. ఇక ధీరజ్ అయితే.. కంగ్రాట్స్‌రా అన్నయ్యా అని అంటాడు. దేవుడా నువ్వు ఉన్నావయ్యా.. ఉన్నావ్.. డాక్టర్ గారూ.. మీరు చెప్పింది నిజమా? మా అమ్మడు తల్లి కాబోతుందా? నేను అమ్మమ్మని కాబోతున్నానా? అని ఆత్రంగా అడుగుతుంది భాగ్యం. ‘అవును.. తను కడుపుతో ఉంది కాబట్టే.. టెన్షన్ ఎక్కువై కళ్లు తిరిగి కింద పడిపోయింది. తను ఇలాగే టెన్షన్ పడితే.. తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డకి కూడా చాలా ప్రమాదం.. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.. ఎట్టిపరిస్థితుల్లోనూ టెన్షన్ పడేట్టు చేయొద్దు’ అని జాగ్రత్తలు చెప్తుంది డాక్టర్. అలాగే చూసుకుంటాం డాక్టర్ అని అంటాడు చందు. సరే పదండీ.. అక్కని చూద్దాం అంటూ అందర్నీ లోపలికి తీసుకుని వెళ్తుంది నర్మద. అమ్మడూ అని భాగ్యం పిలిచేసరికి.. ఎదురుగా చందు నవ్వుతూ కనిపిస్తాడు శ్రీవల్లికి. దాంతో ఆమె ఆనందానికి అవధులు ఉండవు. ‘అమ్మడూ నీ కడుపు పండిందని డాక్టర్లు చెప్పగానే.. ఈ గుండె ఆనందంతో నిండిపోయిందే.. అని ఎమోషనల్ అవుతుంది భాగ్యం. అమ్మడూ.. నన్ను తాతని చేశావ్.. నేతి ఇడ్లీ తిన్నంత ఆనందంగా ఉంది అని అంటాడు ఇడ్లీ తాత. ఇక నర్మద, ప్రేమలు అయితే.. చాలా హ్యాపీగా ఉంది అక్కా.. కంగ్రాట్స్ అని అంటారు. ఇక రేపటి ఎపిసోడ్‌లో రామరాజు ఆనందానికి అవధులు ఉండవు. చందు.. శ్రీవల్లి గురించి నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. వెళ్లి వల్లీని తీసుకుని వద్దాం పదండీ అని అంటాడు రామరాజు.