Stock Split: స్మాల్ క్యాప్ లోని ఐటీ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ ఈ2ఈ నెట్ వర్క్స్ లిమిటెడ్ (E2E Networks Limited) తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ తెచ్చింది. ఇటీవలే జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమంలో 1:10 రేషియోలో చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీంతో ఈ కంపెనీలో 1 షేరు కొనుగోలు చేసి ఉన్న వారికి ఏకంగా 10 షేర్లు వస్తాయి. అయితే, అందుకు తగినట్లుగానే షేరు ధర తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ఇక మరోవైపు ఈ కంపెనీ షేరు గత ఐదేళ్లలో 1956 శాతం లాభాన్ని ఇచ్చి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో నిలిచింది.దీని ప్రకారం.. మీరు ఐదేళ్ల క్రితం ఈ కంపెనీలో రూ. 1 లక్ష పెట్టి షేర్లు కొనుగోలు చేసి ఇప్పటి వరకు కొనసాగినట్లయితే ఇప్పుడు మీ షేర్ల విలువ ఏకంగా రూ. 20.56 లక్షలకు పైగా ఉంటుంది. ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత ప్రస్తుతం రూ. 2950 వద్ద ఉన్న షేర్ ధర రూ. 295 ల స్థాయికి దిగివస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు తమ షేరు ధరను అందుబాటులో ఉంచే ఉద్దేశంతో కంపెనీలు ఇలా స్టాక్ స్ప్లిట్ చేస్తుంటాయి. దీంతో షేరు ధర తగ్గి తక్కువ ధరకే షేర్లు అందుబాటులో ఉంటాయి. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. కంపెనీ బోర్డు సమావేశంలో కంపెనీల చట్టం 2013 లోని సెక్షన్ 61 ని అనుగుణంగా 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టాలని నిర్ణయించారు. దీని అర్థం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక ఈక్విటీ షేరును రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండేలా 10 ఈక్విటీ షేర్లుగా విభజిస్తారు. ఈ స్టాక్ స్ప్లిట్ సంబంధించిన రికార్డు డేట్ త్వరలోనే ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. రిక్స్ స్ప్లిట్ తర్వాత ఒక వేళ షేరు ధర భారీగా పెరిగితే ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో E2E నెట్ వర్క్స్ లిమిటెడ్ షేరు 1.46 శాతం లాభంతో రూ. 2979 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 3,894.70 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 1,833.60 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 7 శాతం లాభాన్ని ఇచ్చింది. గత నెల రోజుల్లో ఈ షేరు 37 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో ఈ షేరు 8 శాతం నష్టపోయింది. గత ఏడాదిలో ఈ షేరు 49 శాతం లాభాన్ని అందించింది. ఇక గత ఐదు సంవత్సరాల్లో ఏకంగా 1956 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 6110 కోట్లుగా ఉంది.