CSK ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. ముంబై‌తో మ్యాచ్‌కి ఆఖరి నిమిషంలో ధోనీ హ్యాండ్? ఐపీఎల్ 2026 ఎంట్రీ ఇక ఆ మ్యాచ్‌తోనే!

Wait 5 sec.

. ప్రారంభమై సగం సీజన్ ముగుస్తున్నా ధోనీ ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదు. సీఎస్కే మ్యాచ్ ఉన్న ప్రతిసారీ ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడుతున్నాడో, ఆ మ్యాచ్‌లో ధోనీ ఆడుతున్నాడే వార్తలు వచ్చి.. చివరకు మ్యాచ్ సమయానికి హ్యాండ్ ఇస్తున్నాడు. .. ఇప్పుడు వాంఖడేలో ఆడటం లేదనే బాంబు లాంటి వార్తని పేల్చారు. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆడటం లేదని రెవ్ స్పోర్ట్స్ స్పష్టం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఏప్రిల్ 26న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లోనే ధోనీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు రెవ్ స్పోర్ట్స్ పేర్కొంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ.. నేరుగా సీఎస్కే హోం గ్రౌండ్‌లోనే బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. అయితే, ధోనీ ప్లేయింగ్ 11లో ఉన్నాడనే నమ్మకంతో సీఎస్కే ఫ్యాన్స్ ఇప్పటికే టికెట్లన్నీ కొనేశారు. ఇక మ్యాచ్ కొద్దిగంటల్లో ప్రారంభం అవుతుందనగా ఇప్పుడు ధోనీ ఆడటం లేదనే వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ప్రతిసారీ మ్యాచ్‌లో ఆడతున్నాడు అని వార్తలు రావడం, ఆ వెంటనే నెక్స్ట్ మ్యాచ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు అని చెప్పడం పరిపాటి అయింది. ఏదేమైనా ఎంఎస్ ధోనీ వాంఖడేలో ఆడకపోవడం ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశనే మిగుల్చుతుంది. ఐపీఎల్ 2026 రెండ్రోజుల్లో ప్రారంభమనగా గాయంతో జట్టుకు దూరమైన ధోనీ.. తొలుత మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోనున్నట్లు సీఎస్కే మేనేజ్‌మెంట్ చెప్పింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో మ్యాచ్ ఆడటానికి సమయం పడుతుందని తెలిపింది. ఇప్పుడు జట్టుతో పాటు ప్రయాణిస్తున్నా.. గ్రౌండ్‌లోకి దిగడానికి ఇంకాస్త సమయం పడుతుందని చెప్పకనే చెబుతోంది. మొత్తానికి ధోనీ ఫ్యాన్స్ తలా ఎంట్రీ కోసం ఇంకొన్ని మ్యాచ్‌లు వేచి చూడాల్సిందే.