వారి కోసం కొత్త సేవింగ్స్ అకౌంట్ తీసుకొచ్చిన బ్యాంక్.. ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్స్, డిస్కౌంట్లు సహా ఎన్నో బెనిఫిట్స్!

Wait 5 sec.

BoB : ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. ఎన్నో రకాల అవసరాలకు ఇది కావాలి. స్కాలర్ షిప్స్, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు.. జీతం కోసం శాలరీ అకౌంట్.. లోన్ తీసుకునేందుకు ఇలా ఎన్నో అవసరాల కోసం బ్యాంకుల్లో అకౌంట్లు తీసుకునేవారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే బ్యాంకులు కూడా వేర్వేరు ప్రయోజనాలతో కొత్త రకం అకౌంట్లను కస్టమర్లకు పరిచయం చేస్తున్నాయి. ఇప్పుడు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైనటువంటి.. . ఇదే బీఓబీ సీనియర్ సిటిజెన్ విశేష్ సమ్మాన్. ఇది కేవలం సీనియర్ సిటిజెన్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ప్రీమియం అకౌంట్ కాబట్టి.. ఇందులో నెలకు సగటున రూ. 1 లక్ష వరకు బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం సేవింగ్స్ అకౌంట్ ఎన్నో ప్రయోజనాల్ని అందిస్తోంది. ముఖ్యంగా ఇంటిదగ్గరికే బ్యాంకింగ్ సర్వీసుల్ని తీసుకొస్తోంది. అంటే సీనియర్ సిటిజెన్లు బ్యాంకింగ్ సేవల కోసం పెద్దగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. సీనియర్ సిటిజెన్లకు ఇంకా ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల్ని కూడా అందిస్తోంది. ఇందులో ఫ్రీ ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్స్ వంటివి కూడా ఉన్నాయి. ఔషధాలపై డిస్కౌంట్లు, రోగ నిర్ధరణ టెస్టులపై తగ్గింపులు వంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సీనియర్ సిటిజెన్లకు అన్ని రకాలుగా ఉపయోగపడేలా.. సమగ్ర ప్రణాళికతో ఈ కొత్త రకం సేవింగ్స్ అకౌంట్ తీసుకొచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది. 60 ఏళ్లు ఆపైన వయసు వారికి మాత్రమే ఈ కొత్త రకం అకౌంట్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి ప్రయోజనాలు ఇవే..గరిష్ఠంగా కుటుంబంలో ఆరుగురు సభ్యుల వరకు ఉచితంగా ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్స్ పొందొచ్చు. ఆన్‌లైన్‌లో మెడిసిన్ కొనుగోలుపై 15 శాతం వరకు రాయితీ పొందొచ్చు.రోగ సంబంధిత టెస్టులపై 20 శాతం వరకు రాయితీ వస్తుంది. నెలకు 2 కాంప్లిమెంటరీ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు పొందొచ్చు. హెల్త్ చెక్-అప్స్ సహా ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, జిమ్ మెంబర్‌షిప్, స్పా/సెలూన్, గోల్ఫ్, ఓటీటీ మెంబర్‌షిప్ వంటి బెనిఫిట్స్ ఉండే బీఓబీ భూమి రూపే సెలక్ట్ డెబిట్ కార్డ్ కూడా ఇస్తుంది. రివర్స్ మార్ట్‌గేజ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం మినహాయింపు ఉంటుంది. లాకర్ ఛార్జీల్లో 20 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. గరిష్ఠ పరిమితి రూ. 500. ఫ్రీ నెఫ్ట్, ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ ఛార్జీలపై 50 శాతం మినహాయింపు ఉంటుంది.