IPL 2026 పాయింట్స్ టేబుల్.. కిందపడి పైకిలేచిన రాజస్థాన్, మళ్లీ పాత ప్లేస్‌కే సన్‌రైజర్స్!

Wait 5 sec.

ఆరంభంలో ప్రభంజనం సృష్టించిన ఒక్కసారిగా కుదేలయింది. సన్‌రైజర్స్ ఇచ్చిన షాక్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన రాజస్థాన్.. మళ్లీ పుంజుకుని పైకిలేచింది. పై థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న తర్వాత రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్‌కి వెళ్లకపోయినా టాప్ 2లో సెటిల్ అయింది. ఈ సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ చాలా రోజుల పాటు టేబుల్ టాపర్‌గా నిలిచింది. హైదరాబాద్ వేదికగా సన్‌రైజ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దారుణ పరాజయం పాలవడంతో ఒక్కసారిగా కింది స్థానాలకు దిగొచ్చింది. ఆ వెంటనే కేకేఆర్‌ కూడా ట్విస్ట్ ఇవ్వడంతో రాజస్థాన్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ.. లక్నోతో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుని ప్రస్తుతం రెండో స్థానానికి ఎగబాకింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడో స్థానంలో నిలవగా.. రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానానికి ఎగబాకడంతో ఎస్ఆర్‌హెచ్ మళ్లీ నాలుగో స్థానానికే వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడితే నాలుగు గెలిచి, మూడు ఓడింది. మొత్తం ఎనిమిది పాయింట్లు సాధించింది. సన్‌రైజర్స్ గెలిచిన నాలుగు మ్యాచ్‌లూ సెకండ్ బౌలింగ్‌లోనే కావడం విశేషం. ఇక ఈ సీజన్‌లో ఓటమి ఎరుగకుండా దూసుకుపోతోన్న పంజాబ్ కింగ్స్ 11 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి, రెండు ఓడింది. 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరు మ్యాచ్‌లలో మూడు గెలిచి, మూడు ఓడాయి. ఇరు జట్లు చెరి ఆరు పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ ఏడాది దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో గెలిచిన ముంబై, వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. గుజరాత్‌పై మంచి కమ్ బ్యాక్ ఇచ్చినప్పటికీ నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలోనే ఉంది. ఇక వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన సీఎస్కే, ఆ వెంటనే రెండు మ్యాచ్‌లు గెలిచింది. హ్యాట్రిక్ విజయం సాధిస్తుంది అనుకున్న సమయంలో సన్‌రైజర్స్ దెబ్బేసింది. దాంతో నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఏడు మ్యాచ్‌లలో కేవలం రెండే గెలిచి, నాలుగు పాయింట్లతో -1.277 రన్‌రేట్‌తో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఇక ఈ సీజన్‌లో అస్సలు విజయమే దొరకదు అనుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రాజస్థాన్‌పై ఈజీ టార్గెట్‌ను కష్టంగా ఛేదించి తొలి విజయాన్ని అందుకుంది. 7 మ్యాచ్‌లలో ఒకటి గెలిచి రెండు పాయింట్లతో అట్టడుగున పదో స్థానానికి కేకేఆర్ పరిమితమైంది.