మాజీ ఎంపీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనప్పటికీ.. రాజకీయ రంగాన్ని మాత్రం పూర్తిగా విడిచిపెట్టలేదు చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా వివిధ . ఈ క్రమంలోనే తన పొలిటికల్ రీఎంట్రీపై విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. జులై నెలలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో వైసీపీపై విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి. గత ఎన్నికల్లో ఓడించి.. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారన్న విజయసాయిరెడ్డి.. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు తమ పద్ధతి మార్చుకుని, ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. మరోవైపు 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పలువురు నేతలు ఆ పార్టీని వీడారు. ఈ క్రమంలోనే 2025 జనవరి నెలలో వైసీపీ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తన పదవికి న్యాయం చేయలేక రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో విజయసాయిరెడ్డి ప్రకటించారు. విజయసాయిరెడ్డి రాజీనామాకు ఆ వెంటనే రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం కూడా లభించింది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా వివిధ అంశాలపై స్పందిస్తూ వస్తున్న విజయసాయిరెడ్డి.. ఇటీవలే మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తెలుగు, హిందీ, ఇంగ్లీషులో డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువత, రైతాంగం, కార్మికులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజా గొంతుకగా మారతామని పేర్కొన్నారు. ఏ పొలిటికల్ పార్టీకి అనుబంధంగా తాము పనిచేయమని.. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన తర్వాత తెలుగులో శాటిలైట్ ఛానెల్ కూడా తెస్తామని పేర్కొన్నారు. త్వరలోనే వీటి పేర్లు ప్రకటిస్తామంటూ విజయసాయిరెడ్డి ఇటీవల ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున విలేకర్లతో మాట్లాడారు విజయసాయిరెడ్డి. ఏపీ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి నివాసంలో శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏమీ లభించలేదని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలోనే రాజకీయ విషయాలపై మాట్లాడిన విజయసాయిరెడ్డి జూలైలో రాజకీయాల్లోకి మళ్లీ వస్తానని ప్రకటించారు. అలాగే ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరముందని వ్యాఖ్యనించటంతో విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెడతారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.