రాఘవ్ చద్ధా సహా ఆప్ ఎంపీల నిష్క్రమణపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

సహా ఎంపీల నిష్క్రమణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ సరైన మార్గంలో నడిచి ఉంటే ఎంపీలు బయటకు వెళ్లేవారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆప్‌‌ ఎంపీలు బీజేపీలో చేరికపై మీడియాతో మాట్లాడుతూ... ‘‘ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుంది... వాళ్లు (రాఘవ్ చద్ధా, ఇతరులు) తప్పకుండా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఇది ఆప్ నాయకత్వ వైఫల్యమే.. పార్టీ సరైన దారిలో వెళ్తే వాళ్లు నిష్క్రమించేవారు కాదు’’ అని అన్నారు.‘‘వారు ఆప్‌ను వీడటానికి ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది. ప్రజాస్వామ్యంలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ వీడాలో అనే దానిపై ప్రతి వ్యక్తికీ ఒక అభిప్రాయం ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. 2011లో జన్ లోక్‌పాల్ కోసం అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతోనే అరవింద్ కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడాన్ని హజారే వ్యతిరేకించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకానొక సందర్భంలో రాజకీయాల్లో వద్దని పలుసార్లు తాను చెప్పినా కేజ్రీవాల్ వినిపించుకోలేదని వ్యాఖ్యానించారు. ఇటీవల ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీని కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తర్వాత అన్నా హజారే స్పందిస్తూ.. పార్టీ కోసం కాకుండా సమాజం, దేశం కోసం పనిచేయాలని ఆయనకు సలహా ఇచ్చారుఇక, ఆప్ రాజ్యసభ ఎంపీలలో దాదాపు మూడింట రెండొంతుల మంది బీజేపీలో పార్లమెంట్ పార్టీని విలీనం చేయాలని ఛైర్మన్‌కు లేఖ రాశారు.ఆప్‌కు చెందిన రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిటల్‌లో అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కలిశారు. ఈ విషయమైన ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. ‘‘ఈరోజు పార్టీ ప్రధాన కార్యాలయంలో రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్‌ను బీజేపీలోకి స్వాగతం పలికాం.. అలాగే, హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, విక్రమ్ సాహ్నీ, రాజిందర్ గుప్తాలు వికసిత్ భారత్ 2024 లక్ష్యం కోసం డైనమిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేయాలని కోరుకుంటున్నారు’’ అని అన్నారు.