ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం.. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

Wait 5 sec.

టీజీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా (54).. ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కంచన్ బాగ్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌తో పాటు కార్మిక సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ.. ఆయన గురువారం నర్సంపేట బస్టాండ్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు. శంకర్ గౌడ్ శరీరం 80 శాతం వరకు కాలిపోవడంతో ఆయన పరిస్థితి మొదటి విషమించింది. తొలుత ఆయన్ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మార్గమధ్యంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో అంబులెన్స్ సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేశారు. అనంతరం డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చేర్పించినప్పటికీ పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు.శంకర్ గౌడ్ మరణవార్త తెలియగానే ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు.. అర్థరాత్రి సమయంలో శంకర్‌ను పరామర్శించేందుకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను లోపలికి అనుమతించకపోవడంతో ఆసుపత్రి ఆవరణలో వాగ్వాదం చోటుచేసుకుంది, చివరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.కాగా, ఆర్టీసీ కార్మికులు వరుసగా ఆత్మహత్యాయత్నాలు చేస్తున్న ఘటనపై వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చించిన ఆయన.. కార్మికులు ఎవరూ తొందరపడి ఆత్మహత్యల వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావని.. అవి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తాయని అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. ఇందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం నేడు కార్మిక సంఘాలతో చర్చలు జరపనుందని వెల్లడించారు.శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేసేందుకు రెడీ అవుతున్నారు. డిపోల వద్ద నిరసనలు వ్యక్తం చేసేందుకు రెడీ అవుతున్నారు. నేడు జరగబోయే చర్చల ఫలితంపైనే సమ్మె భవిష్యత్తు ఆధారపడి ఉందని కార్మిక సంఘాల ఐకాస నేతలు చెబుతున్నారు.