వరల్డ్ బెస్ట్ ప్లేయర్లున్న . గుజరాత్ విజయంతో కూడగట్టుకున్న కాన్ఫిడెన్స్ మొత్తాన్నీ ఈ ఒక్క ఓటమితో పోగొట్టుకుంది. హోం గ్రౌండ్‌లో కనీస పోరాటం కూడా చేయలేక చేతులెత్తేసింది. ముంబైని ఈ రేంజ్‌లో చిత్తుగా ఓడించిన ఏకైక జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే వేదికగా జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చిత్తుచిత్తుగా ఓడింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన జట్ల మధ్య జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఏకపక్ష విజయం సాధించింది. చెన్నైని బౌలింగ్‌లో అదుపుచేయలేకపోయిన ముంబై.. బ్యాటింగ్‌లో కూడా పోరాడలేకపోయింది. టాప్ క్లాస్ బ్యాటర్లు ఉన్నప్పటికీ కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయ్యి 103 పరుగుల తేడాతో ఘోర పరాజయంపాలయింది. ముంబై ఇంత భారీ తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 14 బంతుల్లో మూడు ఫోర్లు, 1 సిక్సర్‌తో 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత పెద్దగా ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడకపోయినా సంజూ శాంసన్ తనదైన స్టయిల్‌లో రాణించి సెంచరీ చేశాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 207/6 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ చెన్నై స్పిన్ ధాటికి తట్టుకోలేకపోయింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం.. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కాసేపు ఇన్నింగ్స్‌ని నిలబెట్టే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ 19 ఓవర్లకే 104 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై ఇండియన్స్ చరిత్రలో అత్యంత ఎక్కువ మార్జిన్ తేడాతో ఓడిన లిస్ట్‌లో ఐపీఎల్ 2026 వాంఖడే వేదికగా చెన్నై చేతిలో 103 పరుగుల తేడాతో ఓడిందే మొదటి లిస్ట్‌లో ఉంటుంది. ఆ తర్వాత 2013లో జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 87 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. 2016లో వైజాగ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 85 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొహాలీలో కింగ్స్ 11 పంజాబ్‌పై 2011లో 76, 2008లో 66 పరుగుల తేడాతో ఓటమిపాలయింది.