అన్నంత పని చేస్తున్న టెక్ దిగ్గజం.. 8 వేల మందిపై వేటు.. కొత్త నియామకాలు కూడా రద్దు

Wait 5 sec.

: ప్రస్తుత రోజుల్లో ఏ ఉద్యోగానికీ గ్యారెంటీ ఉండట్లేదు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా సడెన్‌గా వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఒకవైపు ఆర్థిక అనిశ్చితి నెలకొనడం.. మరోవైపు ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిపోవడం.. దీంతో చివరికి ఉద్యోగులపైనే ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే ఏఐ వినియోగాన్ని పెంచడంలో భాగంగా అమెజాన్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, బ్లాక్ (x) సహా ఇంకా ఎన్నో దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ విధించిన సంగతి తెలిసిందే. ఉన్నట్లుండి వేలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇప్పుడు మరో టెక్ దిగ్గజ సంస్థ.. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా కూడా అదే బాటలో కీలక ప్రకటన చేసింది. 8 వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు వెల్లడించింది. . ఇప్పుడు స్వయంగా కంపెనీనే దీని గురించి ప్రకటన విడుదల చేసింది. 8 వేల మంది ఉద్యోగులు అనేది.. కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 10 శాతంగా ఉంటుంది. కంపెనీని మరింత సమర్థంగా నిర్వహించడంలో భాగంగానే.. ఏఐ వినియోగాన్ని పెంచేందుకు అటువైపు పెట్టుబడులు పెడుతున్నామని.. ఈ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపు ఉందని సంస్థ స్వయంగా పేర్కొంది. మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జనెల్లీ గాలే.. ఉద్యోగులకు చేసిన మెయిల్‌లో కీలక విషయాల్ని వెల్లడించారు. మే 20న ఈ తొలగింపులు ఉంటాయని స్పష్టం చేశారు. ఇదే సమయంలో మరో షాక్ కూడా ఇచ్చారు. దాదాపు 6 వేల మంది ఉద్యోగుల్ని నియమించుకోవాలని కొద్ది రోజుల కిందట ప్లాన్ చేయగా.. ఇప్పుడు ఆ నియామక ప్రక్రియను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఏఐపై పెట్టుబడులు పెడుతున్న తరుణంలో.. ఖర్చుల్ని తగ్గించుకునేందుకే ఉద్యోగుల్ని తొలగించాల్సి వస్తుందని ఆమె చెప్పారు. లేఆఫ్స్‌ బాధితులకు సెవరెన్స్ ప్యాకేజీ ఇవ్వనుంది. ఇక్కడ 16 వారాలకు సమానమైన బేస్ పే, సర్వీస్ కాలాన్ని బట్టి అదనపు పరిహారం ఇంకా 18 నెలల వరకు ఎక్స్‌టెండెడ్ హెల్త్ కవరేజీ అందించనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాదిని సుమారు 79 వేల మంది ఉద్యోగులతో ప్రారంభించిన మెటాలో ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు భారీగా తగ్గనుందన్న మాట. వచ్చే వారమే త్రైమాసిక ఫలితాల్ని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకే టెక్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకు లేఆఫ్స్ బారిన పడ్డట్లు తెలుస్తోంది.. అమెజాన్‌ 16 వేల మందికిపైగా తొలగించింది. నోకియా, బ్లాక్, స్నాప్, వాల్ట్ డిస్నీ కంపెనీ ఇలా చాలా కంపెనీలు.. వేలాది మందిపై వేటు వేశాయి.