EPF క్లెయిమ్ రిజెక్ట్ కావొద్దంటే.. మీ KYCని ఇంట్లో నుంచే పూర్తి చేయండి.. 5 స్టెప్స్ ప్రాసెస్ ఇదే..!

Wait 5 sec.

: ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్. ఒక వేళ మీ ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వంటి వివరాలు సరిపోలకపోతే మీ ఈపీఎఫ్ క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఏదైనా నగదును ఉపసంహరించుకునేందుకు అప్లై చేసినప్పుడు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ప్రతిసారి ఈపీఎఫ్ రికార్డులను ఆధార్ డేటాతో క్రాస్-చెక్ చేస్తుంది. అన్ని వివరాలు సరిగ్గా ఉంటేనే ప్రాసెస్ చేస్తుంది. అందుకే ఈపీఎఫ్ మెంబర్ కచ్చితంగా తమ కేవైసీ వివరాలను అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. అలాగే ఆధార్‌లో ఉన్న మాదిరిగా వివరాలను అప్డేట్ గా ఉంటుకోవాలి. ఆన్‌లైన్ ద్వారానే చాలా సులభంగా ఈ ప్రాసెస్ పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. యూఏఎన్ మెంబర్ పోర్టల్ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఉద్యోగులు ఇకపై పెద్ద పెద్ద భౌతిక ఫారమ్‌లను నింపాల్సిన అవసరం లేదు. ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ KYCని అప్‌డేట్ చేయడానికి వారికి కావలసిందల్లా వారి ఆధార్ వివరాలు, ఇంటర్నెట్ మాత్రమే. ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ KYCని అప్‌డేట్ చేయడానికి, క్లెయిమ్ తిరస్కరణను నివారించడానికి ఒక సులభమైన, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడే మనం తెలుసుకుందాం. ఈపీఎఫ్ కేవైసీ ప్రాసెస్క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించడం, ఈ ప్రక్రియలో సంక్లిష్టతలను నివారించడ, డేటా కచ్చితంగా, ఆధార్ ప్రకారం ఉండేలా చూడడం ముఖ్య ఉద్దేశంగా తెలిపింది. వివరాలలో చిన్నపాటి పొరపాట్లు కూడా విత్‌డ్రాయల్ వెరిఫికేషన్ సమయంలో ఆటోమేటిక్ తిరస్కరణకు దారితీయవచ్చు. అందుకే ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.స్టెప్ 1: ముందుగా యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ లోకి యూఏఎన్, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ కావాలి. స్టెప్ 2: హోమ్ స్క్రీన్‌లో మేనేజ్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో మోడిఫై బేసిక్ డీటెయిల్స్ ఎంచుకోవాలి. స్టెప్ 3: మీ కరెక్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వంటి సరైన వివరాలు ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో ఉన్నట్లు సూచించాలి. ఆ తర్వాత సిస్టమ్ యూఐడీఏఐ పోర్టల్ ద్వారా ఆటో వెరిఫై చేస్తుంది. స్టెప్ 4: అన్ని వివరాలను చెక్ చేసిన తర్వాత అప్డేట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంప్లాయర్ అప్రూవల్ కి మారుతుంది. స్టెప్ 5: మీ ఎంప్లాయర్ లాగిన్ అయ్యి అప్రూవ్ చేస్తే సరిపోతుంది.