ఐపీఎల్ 2026లో ప్రభావం ఇప్పుడల్లా పోయేలా లేదు. ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామిలో ఆ జట్టును ఓడించిన ఢిల్లీ.. తమ సొంత గ్రౌండ్‌లో . . ఒకరితర్వాత మరొకరు పెవిలియన్‌కు క్యూ కడుతూనే ఉన్నారు. ఒకానొక దశలో ఐపీఎల్ లోయెస్ట్ స్కోర్ నమోదవుతుందేమోనని అందరూ అనుకున్నారు. ఫ్యాన్స్‌తో పాటు ఆ జట్టు కెప్టెన్ కూడా ఆ షాక్ నుంచి పూర్తిగా కోలుకోలేకపోతున్నాను అని చెబుతున్నాడు. అస్సలు ఏం జరిగిందో కూడా తనకు అర్థం కాలేదని, ఏదేమైనా ఈ షాక్ నుంచి కోలుకుని ముందుకు వెళ్లాలంటూ మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అక్షర్ పటేల్ చెప్పాడు. "ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు. అందుకే క్రికెట్‌లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అంటారు. ఈ మ్యాచ్‌ని మరచిపోయి ముందుకు సాగాలి" అని అక్షర్ పటేల్ అన్నాడు. అదేవిధంగా పాత మ్యాచ్ అనుభవాలను కూడా అక్షర్ పటేల్ గుర్తు చేసుకున్నాడు. పంజాబ్‌ మ్యాచ్‌లో క్యాచ్ డ్రాప్‌లు, గుజరాత్‌పై డేవిడ్ మిల్లర్ సింగిల్ వాటి గురించి కూడా ప్రస్తావించి అప్పుడప్పుడు క్రికెట్‌లో మనవి కాని రోజులు కూడా ఉంటాయని చెప్పాడు. "ఈ రోజు పరిస్థితి వేరు. కానీ మీరు ఒక్కసారి వెనక్కి చూసుకుంటే.. కొన్ని కొన్ని మనకు అనుకూలంగా ఉండి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేది అనిపిస్తుంది. ఆ క్యాచ్‌లు పట్టి ఉంటేనో, లేదా గుజరాత్ మ్యాచ్‌లో ఆ సింగిల్ తీసుంటేనో మ్యాచ్ మనవైపు తిరిగి ఉండేది. ఇలాంటి మాటలకు క్రికెట్‌లో చోటు లేదు. పాజిటివ్‌గా ఉండాలి. గత 5-6 మ్యాచ్‌లలో ఉన్న పాజిటివ్ పాయింట్స్‌ను తీసుకుని ముందుకు వెళ్లాలి" అని అక్షర్ పటేల్ చెప్పాడు. ఆర్సీబీపై దారుణ ఓటమి తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు కఠినంగా మారాయి. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి మూడు మాత్రమే గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి పడిపోయింది. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే ఢిల్లీ మిగిలిన ఆరు మ్యాచ్‌లలో కచ్చితంగా ఐదు గెలవాల్సిందే. ఆ తర్వాత కూడా మిగతా జట్ల రన్‌రేట్, పాయింట్ల ఆధారంగానే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయో, లేదో అనేది చెప్పొచ్చు. మొత్తానికి ఆర్సీబీ విజయం ఢిల్లీ క్యాపిటల్స్‌ను కుదిపేసిందని చెప్పొచ్చు.