‘నువ్వులేక నేనులేను’ టుడే ఎపిసోడ్: ప్రమాదంలో రాధ.. ఎత్తుకెళ్లేందుకు దుర్గ ప్లాన్.. విక్రమ్ అడ్డుకుంటాడా?

Wait 5 sec.

రాధ మీద నీకు కేరింగ్ ఎక్కువ అవుతోంది రా.. రాధ మీద నీ అభిప్రాయం మారుతోంది.. మార్పు మంచిదేలే.. మార్పు మొదలైంది.. అని విక్రమ్‌ని రామ్ ఆట పట్టిస్తుంటాడు. కుటుంబాన్ని వదిలి ఆ అమ్మాయి నాతో ఉంటుంది.. ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా? అని విక్రమ్ అంటాడు. రాధ ఎన్నో సమస్యల్లో ఉంటే మధ్యలో దుర్గ గాడు.. రాధకి నేను తప్పా ఇంకెవరు ఉన్నార్రా.. రాధకి భరోసానివ్వడం నా కనీస ధర్మం కదరా అని విక్రమ్ అంటాడు. నమ్మిన అమ్మాయిని ఎలా మోసం చేస్తాం రా అని విక్రమ్ అని అనడంతో రామ్ షాక్ అవుతాడు. వీడిలో మంచితనం చూస్తే నాకు కొత్తగా ఉందని రామ్ అనుకుంటాడు.లవంగంతో కానిస్టేబుల్ సాంబయ్య కామెడీ సీన్ ఉంటుంది. ఈయన గేజ్, ఏజ్ ఏంటి.. ఇతడ్ని ఎవ్వరూ లవ్ చేయరు అని మోనాలిసా అంటుంది. మరో వైపు రాధ బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. మేం లేకుండా నువ్వు బయటకు వెళ్లొద్దు అని రాధతో సాంబయ్య అంటాడు. జైల్లో ఉన్న నాన్నని చూసేందుకు వెళ్తున్నా అని చెబుతుంది రాధ. సార్‌కు చెప్పారా? అని అడిగితే లేదు అని అంటుంది. నాకు సెక్యూరిటీ వద్దు.. నేను ఒంటరిగా వెళ్తాను అని రాధ అంటుంది.. కానీ సాంబయ్య మాత్రం ఒప్పుకోడు. రాధ బాధను చూసి విక్రమ్‌కి చెప్పకుండానే జైలుకి తీసుకెళ్తాడు సాంబయ్య.రాధ బయటకు వెళ్తున్న విషయాన్ని దుర్గకి ప్రియ చెబుతుంది. మరో వైపు రాధని చూసి శీనయ్య ఎమోషనల్ అవుతాడు. నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని రాధ చెప్పబోతోంటే.. ఏది ఉన్నా నువ్వు విక్రమ్‌కే చెప్పు.. ఇప్పుడు నా కూతురివి కాదు.. విక్రమ్ భర్తవి.. అన్నీ ఆయనకే చెప్పు.. దేవుడే నీ దగ్గర ఉంటే.. ఈ పూజారికి ఎందుకు చెప్పడం.. నిన్ను చూస్తే నా మనసు నిండిపోయింది అని రాధని చెప్పుకుండా ఆపేస్తాడు శీనయ్య. ఇక తన బాధనంతా లోపలో దాచుకుని బాధపడుతుంది రాధ. నువ్వు చేరాల్సిన చోటకే చేరావు.. అని శీనయ్య అంటాడు. అలా రాధని ఒక్క మాట కూడా చెప్పనివ్వడు శీనయ్య.ప్రతీసారి రాధకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది.. వాళ్లని గుడికి తీసుకెళ్లి అర్చన చేయిద్దామా? అని నంద కుమార్, సునంద మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రాధ పేరు మీద కొరియర్ వస్తుంది. అది దుర్గ పంపించాడు అని తెలియడంతో సునంద, నంద కుమార్ షాక్ అవుతారు. అందులో ఉన్న ఫోటోలు, లెటర్స్ చూసి మరింత బాధపడతారు. విక్రమ్‌కి ఈ విషయం చెప్పండని సునంద అనడంతో నంద కుమార్ ఫోన్ చేస్తాడు. రాధ బయటకు వెళ్లిందని విక్రమ్‌కి తెలియడంతో అలెర్ట్ అవుతాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి రాధని ఎత్తుకెళ్దామని దుర్గ వేసిన ప్లాన్‌ను విక్రమ్ అడ్డుకుంటాడా? లేదా? అన్నది చూడాలి.