అంతా బంగారం ధరల మహిమ.. రూ.1 లక్ష పెడితే రూ.3.30 లక్షలు.. SGB రిడంప్షన్ తేదీలు ప్రకటించిన RBI

Wait 5 sec.

SGB Redemption: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరల్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. అయితే గత ఏడాది కాలంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో పసిడిలో పెట్టుబడి పెట్టిన వారికి హైరిటర్న్స్ అందుతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి సైతం మంచి రిటర్న్స్ అందుతున్నాయి. తేదీలను తాజాగా ప్రకటించింది ఆర్‌బీఐ. ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారు ఏప్రిల్ 28, 2026 నుంచి ప్రీమెచ్యూర్ చేసుకునేందుకు అర్హులుగా తెలిపింది.సావెరిన్ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ సమయం 8 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే, 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రీమెచ్యూర్ రిడంప్షన్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ముఖ్యంగా వడ్డీ చెల్లించే తేదీల ప్రకారం ఈ ముందస్తు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. అలాగే గోల్డ్ బాండ్ల రిడంప్షన్ విలువ అనేది 999 ప్యూరిటీ గల గోల్డ్ క్లోజింగ్ ధర సింపుల్ యావరేజ్ ఆధారంగా లెక్కిస్తారు. ఇండియన్ బులియన్, జువెలర్స్ అసోసియేషన్ పబ్లిక్ చేసిన 3 సెషన్ల ధరల సగటు ఆధారంగా రేటు నిర్ణయిస్తారు.2020-21 సిరీస్-1 బాండ్లపై ఎంత లాభం? ఒక్కో గ్రాముకు రూ.15,124గా ధర నిర్ణయించారు. ఏప్రిల్ 23, 24,27 తేదీల్లోని ప్యూర్ గోల్డ్ ధరల సగటు ఆధారంగా ఈ రేటును నిర్ణయించారు. అయితే, 2020-21 సిరీస్-1 గోల్డ్ బాండ్లను జారీ చేసేటప్పుడు ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి గ్రాము ధర రూ.4589 మాత్రమే. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే ఏకంగా 230 శాతం మేర లాభం వచ్చినట్లయింది. అయితే ఆఫ్‌లైన్లో కొనుగోలు చేసిన వారికి అప్పుడు గ్రాము ధర రూ.50 అధనంగా అంటే రూ.4,639కి లభించింది.ఆన్‌లైన్ ధరల మధ్య వ్యత్యాసం చూసుకుంటే రూ.15124-రూ.4589= రూ.10,535 అవుతుంది. అంటే ఒక్క గ్రాముపై రూ.10,535 మేర లాభం వచ్చినట్లయింది. 230 శాతం మేర రిటర్న్స్ వస్తాయి. అంటే 2020లో రూ.1 లక్ష పెట్టి గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసినట్లయితే ఇప్పుడు విక్రయిస్తే ఇప్పుడు రూ.3.30 లక్షలు లభిస్తాయి. అంతే కాదు గోల్డ్ బాండ్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం 2.5 శాతం చొప్పున వడ్డీ కూడా చెల్లిస్తుంది. అంటే బంగారం ధరల పెరుగుదలతో వచ్చే లాభంతో పాటు వడ్డీ సైతం లభిస్తుంది.