: ఆమెకు పెళ్లయి రెండేళ్లు అవుతోంది. అయితే పెళ్లికి ముందే ఆమె మరో వ్యక్తిని ప్రేమించింది. కానీ పెద్దలు మాత్రం ఆమెను బతిమాలో, బామాలో, బుజ్జగించో, నచ్చజెప్పో ఈ వివాహం చేశారు. ఆ తర్వాత ఈమె కూడా బాగానే ఉండడం చూసి అతడిని మర్చిపోయిందని అనుకున్నారు. కానీ అదే వారు చేసిన తప్పు అయింది. పెళ్లయి ఇప్పటికి రెండేళ్లు అవుతుండగా.. తనకు భర్త వద్దని, ప్రియుడే కావాలంటూ రచ్చ చేసింది. ముఖ్యంగా 100 అడుగుల ఎత్తున్న సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టింది. మండుటెండలో.. దాదాపు మూడు గంటల పాటు స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులను తెగ ఇబ్బంది పెట్టేసింది. ఆపూర్తి వివరాలు మీకోసం. అసలేం జరిగిందంటే..?ఉత్తర ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లా బర్మనే గ్రామానికి చెందిన 30 ఏళ్ల పూజ అనే మహిళకు రెండేళ్ల క్రితం స్థానిక వ్యక్తితో వివాహం జరిగింది. అప్పటి నుంచి అత్తింటి వద్దే ఉంటున్న ఆ.., మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అందరినీ గురిచేస్తూ ఇంటి సమీపంలోని . దీంతో ఆమె అత్తింటి వారు సహా స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఏమైందే కిందకు రా అంటూ కేకలు వేశారు. కానీ ఆమె మాత్రం తనకు భర్త వద్దని, పెళ్లికి ముందే తానొక వ్యక్తిని ప్రేమించానని చెప్పింది. . మూడు గంటల పాటు ముప్పు తిప్పలు పెట్టి..పూజ టవర్‌ ఎక్కడంతో పాటు చేసిన డిమాండ్ విన్న గమనించిన గ్రామస్థులు మొదట షాక్‌కు గురయ్యారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు మైకుల ద్వారా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కిందకు దిగి రావాలని, సమస్య ఏదైనా కూర్చుని మాట్లాడుకుందామని బతిమిలాడారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. "నాకు ప్రియుడే కావాలి.. అతడితోనే ఉంటా" అంటూ మూడు గంటల పాటు మండుటెండలో టవర్‌ పైనే నిరసన కొనసాగించింది. చివరికి పోలీసులు ఆమె కోరికను పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో.. మెల్లగా మనసు మార్చుకుని కిందికి దిగివచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు."నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేశారు"టవర్‌ దిగిన తర్వాత ఆమె చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం అవాక్కయ్యారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, బలవంతంగా చేశారని పూజ ఆవేదన వ్యక్తం చేసింది. పక్క గ్రామానికి చెందిన ఒక యువకుడిని తాను గాఢంగా ప్రేమిస్తున్నానని, ఇప్పుడు అతడితోనే కలిసి జీవించాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేసింది. అందుకే తన నిరసనను ప్రపంచానికి తెలియజేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.