: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ 'హనీమూన్ మర్డర్' కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తన భర్తను కిరాతకంగా అంతం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి తాజాగా బెయిల్ మంజూరు అయింది. అయితే ఆమెకు ఈ ఊరట లభించడం వెనుక పోలీసుల వైఫల్యం, సాంకేతిక లోపాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలోనే ఈ పరిణామంపై మృతుడి కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మేఘాలయ హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది.లేని సెక్షన్లు పెట్టడంతో.. సోనమ్‌కు బెయిల్ !భారతీయ న్యాయ సంహిత ప్రకారం.. సెక్షన్ 103(1) కింద కేసులు నమోదు చేయాలి. కానీ సోనమ్ రఘువంశీ కేసులో పోలీసులు ఘోర తప్పిదం చేశారు. సోనమ్ అరెస్ట్ మెమోలో సెక్షన్ 103(1)కు బదులుగా సెక్షన్ 403(1) అని ప్రస్తావించారు. వాస్తవానికి బీఎన్ఎస్ చట్టంలో 403(1) అనే సెక్షనే లేదు. ఇది కేవలం ఒక చోట జరిగిన పొరపాటు కాదని.. కేసుకు సంబంధించిన అన్ని కీలక పత్రాల్లోనూ ఇదే తప్పుడు సెక్షన్ వాడారని కోర్టు గుర్తించింది. "సాంకేతిక పొరపాటు" అని పోలీసులు సమర్థించుకున్నప్పటికీ.. కోర్టు ఆ వాదనను తిరస్కరించింది. ఈ కారణంగా ఆమె అరెస్టుకు సరైన చట్టబద్ధమైన కారణాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది.న్యాయవాదిని కలిసే అవకాశం ఇవ్వలేదా?మరోవైపు సోనమ్‌ను అరెస్టు చేసి తొలిసారి గాజీపుర్ కోర్టులో హాజరు పరిచినప్పుడు.. ఆమెకు న్యాయవాదిని కలిసే అవకాశం ఇచ్చినట్లు ఎక్కడా రికార్డుల్లో లేదని కోర్టు ఎత్తిచూపింది. తన అరెస్టును ప్రారంభంలోనే సవాల్ చేసే హక్కును నిందితురాలు కోల్పోయిందని కోర్టు గుర్తించి.. చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా ఆమె షిల్లాంగ్ జిల్లాను విడిచి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది.పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఒక క్రూరమైన హత్య కేసులో నిందితురాలు బయటకు రావడంపై రాజా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం తాము మేఘాలయ హైకోర్టులో పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు. నిందితురాలికి ఎలాగైనా కఠిన శిక్ష పడే వరకు తాము అస్సలే ఊరుకోమని వివరిస్తున్నారు. ప్రేమ కోసం భర్తను బలితీసుకున్న సోనమ్..!మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీకి, సోనమ్‌కు గతేడాది మే 11వ తేదీన వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన ఈ జంట ఆ తర్వాత అదృశ్యం అయ్యారు. గాలింపు చేపట్టగా.. 11 రోజుల తర్వాత సోహ్రాలోని ఒక లోతైన లోయలో రాజా . అలాగే జూన్ 7వ తేదీన సోనమ్ యూపీలోని గాజీపుర్‌లో ప్రత్యక్షమైంది. విచారణలో తన ప్రియుడు రాజ్‌ కుశ్వాహాతో కలిసి తానే భర్తను చంపించినట్లు ఒప్పుకుంది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.