తెలంగాణలో మరోసారి చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు. రెండు రోజుల కిందటే మహేష్ భగవత్, వీవీ శ్రీనివాసరావు, చారు సిన్హా, అనిల్ కుమార్, కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా, ఏడుగురు అధికారులను బదిలీ చేసి, పలువురికి అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. ఇందులో సీనియార్టీ ప్రాతిపదికన కీలక పోస్ట్‌ల్లో నియమించింది. 1994 బ్యాచ్‌కు చెందిన శిఖా గోయల్‌ను హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆమె విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా, సాధారణ పరిపాలన శాఖ ఎక్స్-ఆఫిషియో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాదు, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతల్లో ఆమె కొనసాగుతారు.ఇక, 1997 బ్యాచ్ ఐపీఎస్ దేవేంద్ర సింగ్ చౌహాన్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా నియమించారు. ప్రస్తుతం చౌహన్ అదనపు డీజీపీ (పర్సనల్)గా ఉన్నారు. అలాగే, డ్రగ్స్ కంట్రోల్ డీజీగా ఉన్న 2003 బ్యాచ్‌కు చెందిన షాన్‌వాజ్ ఖాసిమ్‌ను మల్టీ జోన్-IIగా ఐజీగా, అలాగే పోలీస్ పర్సనల్ విభాగం ఐజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.2004 బ్యాచ్ అధికారి యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్‌ తరుణ్ జోషిని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుత సీపీ సుధీర్ బాబు రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. మల్కాజ్‌గిరి సీపీ అవినాష్ మొహంతి (2005 బ్యాచ్) డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా నియమించారు. అలాగే ఏసీబీ డైరెక్టర్‌గా ఆయన అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంటెలిజెన్స్ ఐజీ, 2006 బ్యాచ్‌కు చెందిన బి సుమతికి మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ ఐజీపీ 2006 బ్యాచ్ అధికారి కార్తికేయకు ఎస్‌ఐబీ (ఇంటెలిజెన్స్) ఐజీపీగా అదనపు బాధ్యతలు కట్టబెట్టింది.