: (ఎన్‌పీఎస్) ద్వారా పింఛను పొందుతున్న కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు అదిరే శుభవార్త. (FMA)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ డబ్బులు ఎలాంటి మెడికల్ బిల్లులు అవసరం లేకుండానే నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. నేరుగా పెన్షన్ జమ చేస్ బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఖర్చల నిర్వహణ విభాగం ఆఫీస్ మెమోరండం జారీ చేసింది. బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు 2026, ఏప్రిల్ 16వ తేదీన జారీ చేసిన మెమోరండంలో కేంద్రం తెలిపింది. ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ ఏమిటి?పెన్షనర్లు తమ రోజువారీ వైద్య అవసరాల కోసం పడే ఇబ్బందులను తొలగించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని ఇస్తోంది. దీని కోసం ఇక నుంచి ఎలాంటి హాస్పిటల్ బిల్లులు లేదా మందుల రసీదులు చూపించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ సేవల్లో ఉండి, నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలో రిటైర్ అయిన ఉద్యోగులు దీనికి అర్హులు. అలాగే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) సదుపాయం లేని ప్రాంతాల్లో నివసిస్తున్నారో లేదా సీజీహెచ్ఎస్ ఓపీడీ సదుపాయాన్ని వదులుకున్నారో వారికి మాత్రమే ఈ నగదు పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పెన్షన్ పథకంలో చేరిన వారు తప్పనిసరిగా తనకు ఎఫ్ఎంఏ కావాలని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.నెలకు ఎంత డబ్బు ఇస్తారు? ఏడాదికి మొత్తం రూ.12000 నేరుగా పెన్షన్ తో పాటు ఖాతాలో జమ చేస్తారు. ఈ మొత్తం ప్రతి నెలా పెన్షన్ వచ్చే బ్యాంకు ఖాతాలోనే క్రెడిట్ చేస్తారు. దీని కోసం విడిగా క్లెయిమ్ చేయాల్సిన పని లేదు. అయితే, ఒక పెన్షనర్ ఒకేసారి సీజీహెచ్ఎస్ లోని ఓపీడీ సదుపాయాన్ని, ఎఫ్ఎంఏ నగదును రెండింటినీ పొందడం కుదరదు. ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి. హాస్పిటల్ లో అడ్మిట్ అయి చేయించుకునే చికిత్సలకు ఎప్పటిలాగే సీజీహెచ్ఎస్ సౌకర్యం వర్తిస్తుంది. కేవలం రోజువారీ మందులు, చెకప్ ల కోసం మాత్రమే రూ.1000 ఎఫ్ఎంఏ ఇస్తారు. పెన్షనర్ తాను సీజీహెచ్ఎల్ వెలుపల ఉన్న ప్రాంతంలో నివరిస్తున్నట్లు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.చిన్న చిన్న వైద్య ఖర్చుల కోసం బిల్లులు దాచుకోవడం, వాటిని అధికారులకు సమర్పించి నెలల తరబడి వేచి చూడడం వంటి ఇబ్బందులు ఇక తొలిగిపోనున్నాయి. నెలకు రూ.1000 అనేది చిన్న మొత్తంగా కనిపించినా క్రమం తప్పకుండా మదులు ఉపయోగించే వృద్ధులకు ఇది గొప్ప ఆర్థిక భరోసాగా చెప్పవచ్చు. ఎలాంటి బిల్లులు చూపించకుండానే ఇకపై నేరుగా ఖాతాలో జమ చేయడం ద్వారా ఇబ్బందులు తొలగిపోనున్నాయి. కావాల్సినప్పుడు ఆ డబ్బులను ఉపయోగించుకునే వెసులుబాటు లభిస్తుంది.