ముంబై ఇండియన్స్ ఘోర ఓటమి తర్వాత.. కొడుకు, గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ ఫొటోలు నెట్టింట వైరల్!

Wait 5 sec.

. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌కి ఇలాంటి ఓటమి ఇప్పటివరకూ లేదు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ .. తన కొడుకు, గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. హార్దిక్ పాండ్యాకి తన కొడుకు అగస్త్య అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటాషాతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా హార్దిక్ తన కొడుకును మాత్రం దూరం చేసుకోలేదు. వీలైనప్పుడల్లా తన కొడుకును కలుస్తూ, ఖరీదైన బహుమతులు అందిస్తూనే ఉన్నాడు. తాజాగా ఒక కాస్ట్లీ కారు కూడా అగస్త్యాకి హార్దిక్ బహుమతిగా ఇచ్చాడు. ఇక గర్ల్‌ఫ్రెండ్ కూడా అగస్త్యతో ఎంతో ప్రేమగా ఉంటుంది. మహీకాతో కలిసే అగస్త్య టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లను కూడా వీక్షించాడు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ మొదలవ్వడంతో ఈ మ్యాచ్‌లను కూడా అగస్త్యాతో కలిసే మహీకా చూస్తోంది. హార్దిక్ గ్రౌండ్‌లో ఉంటే స్టాండ్స్‌లో ఈ ఇద్దరూ కలిసి అల్లరి చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మహీకా అగస్త్యను తల్లిగానే చూసుకుంటుంది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పాటు హిట్టర్లయిన హార్దిక్ పాండ్యా, రూధర్‌ఫోర్డ్ కూడా దారుణంగా 1, 0 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. దాంతో ముంబై ఓటమిపాలవ్వక తప్పలేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 207/6 పరుగులు చేయడంతో 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా గ్రౌండ్‌లో నుంచే కొడుకు అగస్త్యను త్వరగా వెళ్లి నిద్రపొమ్మని చెప్పాడు. మ్యాచ్ ముగిసే సమయానికి దాదాపు 12 గంటల వరకు కావడంతో తర్వాత ప్రజంటేషన్ ఇవన్నీ ఉండటంతో రూమ్‌కి వెళ్లి త్వరగా నిద్రపోవాలని చెప్పాడు. హార్దిక్ ఒక తండ్రిగా ఎంత కేరింగ్‌గా ఉన్నాడో ఇక్కడే తెలుస్తుంది. అగస్త్యతో పాటు మహీకాకు కూడా చెప్పాల్సింది చెప్పి హార్దిక్ అక్కడ నుంచి పంపించేశాడు. ఈ ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.