డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..

Wait 5 sec.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ రాజమహేంద్రవరం కోర్టులో పోలీస్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ రద్దు పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగ్గా.. విచారణ కోసం ఎమ్మెల్సీ అనంతబాబు, రాజమండ్రి కోర్టుకు వచ్చారు. కోర్టులో విచారణ తర్వాత కోర్టు నుంచి బయటకి రాగానే అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నేపథ్యంలో రాజమహేంద్రవరం కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు.డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి సాక్షులను బెదిరించారని అనంతబాబుపై సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో అనంతబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు ఇటీవల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అనంతబాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు విజయవాడ, విశాఖపట్నం సహా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ గాలించారు. మరోవైపు సాక్షులను బెదిరించారని తనపై నమోదైన కేసును కొట్టివేసేలా పోలీసులను ఆదేశించాలంటూ ఎమ్మెల్సీ అనంతబాబు గురువారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తన పిటిషన్ అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఈ పిటిషన్ మీద శుక్రవారం విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది.ఇదే సమయంలో అనంతబాబు బెయిల్‌ షరతులు ఉల్లంఘించారని.. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్‌ను రద్దు చేయాలంటూ రాజమహేంద్రవరం కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ కోసం అనంతబాబు రాజమహేంద్రవరం కోర్టుకు రాగా.. కోర్టు నుంచి బయటకు రాగానే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబుతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సర్పవరం స్టేషన్‌ ఇన్‌ఛార్జి సీఐ రవికుమార్‌ను వీఆర్‌కు పంపించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో సీఐ రవికుమార్‌ను కొనసాగించడం తగదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. రవికుమార్ స్థానంలో తుని రూరల్‌ సీఐ చెన్నకేశవరావును నియమించారు.