: భారతీయ పౌరులు పరిమితికి మించి ఆదాయం సంపాదిస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు (ITR) ఫైల్ చేయాల్సి ఉంటుంది. తమకు వచ్చే ఆదాయం శాలరీ, ప్రాఫిట్, స్థిరాస్తుల విక్రయంతో వచ్చే లాభాలు, క్యాపిటల్ గెయిన్స్, వడ్డీలు, డివిడెండ్ల ఆదాయల వంటి వివిధ రకాల ఆదాయ మార్గాలకు సంబంధించిన వివరాలు అందించాల్సి ఉంటుంది. ట్యాక్స్ రిటర్నులు ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా ఇ-ఫైలింగ్ తో చాలా ఈజీగా పూర్తి చేసే అవకాశం లభించింది. అందుకో తొలిసారి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసే వారు కొన్ని ముఖ్యమైన అంశాలు, పదాల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. పన్ను మినహాయింపులు, డిడక్షన్లు, ట్యాక్స్ రిబేట్ మధ్య ఉండే తేడాలను తెలుసుకోవాలి.ఆదాయపు పన్ను మినహాయింపు అంటే ఏంటి?ఆదాయపు పన్నులో మినహాయింపులు (Exemption) అనేది ఆదాయపు పన్ను చట్టంలో నిర్వచించిన విధంగా కొన్ని రకాల ఆదాయ వనరులపై ఆదాయపు పన్ను మినహాయింపులు ఇస్తారు. ఉదాహరణకు వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఆస్తిని అమ్మి వచ్చిన లాభాలను మరొక స్థిరాస్తిలో తిరిగి పెట్టుబడిగా పెట్టినప్పుడు, ఇంటి అద్దె చెల్లింపునకు (కొన్ని షరతులకు లోబడి) కూడా మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 10 అనేది వ్యవసాయ ఆదాయం, పిల్లల కోసం ఇచ్చే ఎడ్యుకేషన్, హాస్టల్ అలవెన్సులు, వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా వచ్చే గ్రాట్యుటీ, హెచ్ఆర్ఏ, లీవి ట్రావెల్ అలవెన్సులు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ వంటి ఆదాయాలను డీల్ చేస్తుంది. నిబంధనల మేరకు మినహాయింపులు ఉంటాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ డిడక్షన్లు అంటే ఏమిటి?తగ్గింపులు (డిడక్షన్లు) అనేవి స్థూల మొత్తం ఆదాయంపై క్లెయిమ్ చేయగల పెట్టుబడులు, ఖర్చులు. ఇవి పన్ను చెల్లింపుదారుని మొత్తం పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గించి, తద్వారా చెల్లించవలసిన పన్నును తగ్గిస్తాయి. విద్య, వైద్య బీమా లేదా నిర్దిష్ట మ్యూచువల్ ఫండ్లలో చేసిన పెట్టుబడులు ఇందులో ఉంటాయి. ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి రూ.50 వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. అలాగే సెక్షన్ 80సీ ద్వారా ప్రతి ఏడాది రూ.1.50 లక్షల వరకు వివిధ రకాల పెట్టుబడులపై డిడక్షన్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే సక్షెన్ 80డీ ద్వారా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై రూ.25 వేలు, అలాగే తల్లిదండ్రుల కోసం మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటే మరో రూ.25 వేలు క్లెయిమ్ చేయవచ్చు. ఇక సెక్షన్ 24 ద్వారా హోమ్ లోన్ రీపేమెంట్స్, హౌస్ ప్రాపర్టీ నష్టాలపై రూ.2 లక్షల వరకు తగ్గింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిబేట్ అంటే ఏమిటి?మొత్తం పన్ను చెల్లించే మొత్తంపై రీబేట్ పొందుతారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87ఏ పన్ను రిబేట్ ఇస్తారు. 10 శాతం ట్యాక్స్ స్లాబ్ ప్రకారం వస్తుంది. కొత్త పన్ను విధానంలో ప్రస్తుతం ట్యాక్స్ రిబేట్ రూ.60 వేలుగా ఇచ్చారు. దీంతో రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్ను పడదు. ఇక పాత పన్ను విధానంలో అయితే రూ.5 లక్షల వరకు ఆదాయానికి రూ.12,500 వరకు రిబేట్ లభిస్తుంది. మరోవైపు.. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై రిబేట్ పొందడానికి లేదు. ఈ ఆదాయాలకు ప్రత్యేక పన్నులు ఉంటాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకే రిబేట్ ఉంటుంది. కంపెనీలు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు ఇది ఉండదు.