15 ఏళ్లకే ఆ బాదుడేందీ.. బాస్ బేబీ వైభవ్‌కు ఫ్యాన్ అయిపోయిన ప్యాట్ కమిన్స్!

Wait 5 sec.

. గతేడాది ఐపీఎల్‌లో అడుగుపెట్టి 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ.. ఈ ఏడాది 36 బంతుల్లో సెంచరీ చేసి మరో రికార్డు నెలకొల్పాడు. ఆటను చూసిన సన్‌రైజర్స్ కెప్టెన్ ఫిదా అయ్యానంటూ తానే నేరుగా చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్‌లో ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌పై ఆడిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన వైభవ్.. ఆ తర్వాత చాలా ఏడ్చేశాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ వైభవ్ డకౌట్ అవ్వడం అదే తొలిసారి. దాంతో హోం గ్రౌండ్‌ జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో అందుకు రివేంజ్ తీర్చుకున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్లను చెడుగుడు ఆడేశాడు. ఆరంభం నుంచే సిక్సర్ల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్.. 37వ బంతికి ఎల్‌బీడబ్ల్యూగా అవుటయ్యాడు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. 103 పరుగులు చేసి అవుటైన వైభవ్ సూర్యవంశీని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పొగడ్తలతో ముంచెత్తాడు. వైభవ్ ఆట చూస్తుంటే చాలా ఫన్‌గా ఉందని, అతని ఆటతీరుకు ముగ్ధుడయ్యానని ప్యాట్ కమిన్స్ చెప్పాడు. "అతని ఇప్పటి నుంచి నా కొత్త ఫేవరెట్ ప్లేయర్. బంతిని ఎంత బలంగా కొడుతున్నాడో, అతని ఆట చూడటానికి చాలా బాగుంది. అతను ఆడే విధానం కూడా నాకు బాగా నచ్చింది" అని మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీని ప్యాట్ కమిన్స్ పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 103 హైయెస్ట్‌తో 357 పరుగులు నమోదు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉండటం విశేషం. గతేడాది ఏడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్ 101 హైయెస్ట్‌తో 252 పరుగులు చేశాడు. మరి ఈ సంవత్సరం ఇప్పటికే 357 పరుగులు చేసిన వైభవ్, సీజన్ ముగిసే సమయానికి ఎన్ని పరుగులు చేసి ఏ ఏ రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.