SRH విజయ విహారం.. టాప్ 3 ప్లేస్‌కి ఎగబాకిన ఆరెంజ్ ఆర్మీ!

Wait 5 sec.

లో తన హవా కొనసాగిస్తోంది. బ్యాటింగ్ మాన్‌స్టర్స్‌గా పేరొందిన ఆరెంజ్ ఆర్మీ ఆరంభంలో పరాజయాలు పాలయినా.. ఆ తర్వాత విజయాల బాట పట్టింది. హ్యాట్రిక్ విక్టరీలు సాధించిన సన్‌రైజర్స్.. ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోతోంది. పాయింట్ల పట్టికలోనూ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్తోంది. ఐపీఎల్ 2026లో జట్టు విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ ఐదు గెలిచి మూడు ఓడింది. ఆర్సీబీ, రాజస్థాన్‌తో సమానంగా విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఐదు విజయాల్లో నాలుగు ఛేజింగ్‌లో డిఫెండ్ చేయగా.. తొలిసారి భారీ స్కోర్‌ను ఛేజ్ చేసి విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌ను వాళ్ల సొంతగడ్డ మీదే చిత్తు చిత్తుగా ఓడించింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్ సూర్యవంశీ సెంచరీతో 228/6 పరుగులు చేసింది. భారీ టార్గెట్ ఛేజింగ్, అది కూడా జైపూర్‌లో కావడంతో తొలుత అభిమానులు కూడా ఈ స్కోర్ ఛేజ్ చేయగలరా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. కానీ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌‌కు గ్రాండ్ విక్టరీ దక్కేలా చేశారు. అభిషేక్ 57, ఇషాన్ 74, నితీష్ కుమార్ రెడ్డి 36 పరుగులతో రాణించడంతో 18.3 ఓవర్లలోనే 229/5తో సన్‌రైజర్స్ విజయం సాధించింది. తొలి ఏడు మ్యాచ్‌లకు ఇషాన్ కిషన్ సారథ్యం వహించగా, ఎనిమిదో మ్యాచ్‌కి ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రీ ఎంట్రీ ఇచ్చి పగ్గాలు అందుకున్నాడు. ఇషాన్ కిషన్ తొలి ఏడు మ్యాచ్‌లలో నాలుగు గెలిపించి ఆరెంజ్ ఆర్మీని టాప్ 4లో నిలిపాడు. ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ అయ్యేలా ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చేసిన తొలి మ్యాచ్‌లోనే జట్టును గెలిపించాడు. గ్రూప్ స్టేజ్‌లో సన్‌రైజర్స్ ఇక ఆరు మ్యాచ్‌లలో ఆడాల్సి ఉంది. ముంబై, కోల్‌కతా, పంజాబ్, గుజరాత్, సీఎస్కే, ఆర్సీబీతో ఆడాల్సి ఉంది. ఈ ఆరింటిలో కనీసం మూడు గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌లో నిలిచే అవకాశం ఉంటుంది.