IPL 2026 వీకెండ్ డబుల్ హెడ్డర్.. సీఎస్కే మ్యాచ్ ఎప్పుడంటే?

Wait 5 sec.

లో భాగంగా ఈ రోజు డబుల్ హెడ్డర్ ఉంది. ఈ డబుల్ హెడ్డర్‌లో మధ్యాహ్నం, రాత్రి రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య వీకెండ్ రసవత్తర పోరు జరగనుంది. ఫామ్‌లోకి వచ్చిన సీఎస్కే ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా సీఎస్కే - గుజరాత్ టైటాన్స్ మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుంది. హోం గ్రౌండ్‌లో వరుస విజయాలు సాధించిన సీఎస్కే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో దూసుకెళ్లాలని చూస్తోంది. ఇక వరుస ఓటములతో ఉన్న గుజరాత్ టైటాన్స్ సీఎస్కేను ఓడించి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. పాయింట్ల పట్టికలో సీఎస్కే ఐదో స్థానంలో కొనసాగుతుండగా, గుజరాత్ టైటాన్స్ ఏడో స్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఎనిమిది మ్యాచ్‌లు జరగ్గా.. సీఎస్కే 4, గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. దాంతో ఈ మ్యాచ్ పోటాపోటీగా సాగే అవకాశం ఉంది. చెన్నైలో మ్యాచ్ కావడం, అదీ మధ్యాహ్నం పూట జరగనుండటంతో టాస్ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌తో ఎంఎస్ ధోనీ ఎంట్రీ ఇస్తాడని అనుకుంటున్నా.. పూర్తి స్థాయిలో క్లారిటీ మాత్రం లేదు. ఇక డబుల్ హెడ్డర్ రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ - గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఇకానా స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ రెండు మ్యాచ్‌ల లైవ్‌లను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. లక్నో - కోల్‌కతా మధ్య ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు జరిగితే లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఆధిపత్యం ప్రదర్శించింది. ఏడు మ్యాచ్‌లలో లక్నో ఐదు గెలవగా, కోల్‌కతా కేవలం రెండు మ్యాచ్‌లలోనే విజయం సాధించింది. ఈ ఏడాది ఇరు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగ్గా అందులో లక్నో మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక కేకేఆర్ గెలిచిన రెండు మ్యాచ్‌లు కూడా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో 2024లోనే కావడం విశేషం. దాంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్ బ్యాక్ ఇవ్వాలని కోల్‌కతా చూస్తోంది.