Paytm License: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)కు ఆర్‌బీఐ తీసుకున్న చర్యల వల్ల పేటీఎం యాప్, యూపీఐ సేవలు సైతం ఆగిపోతాయనే ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఆర్‌బీఐ నిర్ణయం వల్ల తమ సంస్థపై ఆర్థిక, వ్యాపార ప్రభావం ఉండదని డిజిటల్ పేమెంట్ల సంస్థ పేటీఎం (మాతృ సంస్థ లిమిటెడ్) క్లారిటీ ఇచ్చింది. ఆ బ్యాంకింగ్ కంపెనీతో తమకు ఎలాంటి కీలక ఒప్పందాలు లేవని, తమ సర్వీసులన్నీ ఎప్పటి మాదిరిగానే యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్టుబడిదారులు, వినియోగదారులకు భరోసా కల్పించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పూర్తిగా స్వతంత్రంగా పని చేస్తుందోని, అందులో పేటీఎం బోర్డు లేదా యాజమాన్యానికి ప్రమేయం లేదని స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈ మేరకు సమాచారం అందించింది. 2024 మార్చి 1వ తేదీన వెల్లడించినట్లుగానే పీపీబీఎల్ భాగస్వామ్యంతో తాము ఎలాంటి సర్వీసులు అందించడం లేదని తెలిపింది. 2024, మార్చి 31వ తేదీ నాటికే పీపీబీఎల్ లో తమ పెట్టుబడులను లెక్కించి రద్దు చేసుకున్నట్లు గుర్తు చేసింది. ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంకుతో పేటీఎం యాప్, యూపీఐ సర్వీసుల వ్యాపారానికి ఎలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పింది. యథావిధిగా యూపీఐ సేవలుదేశంలో ప్రస్తుతం కోట్లాది మంది యూపీఐ సేవలు వినియోగిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే తర్వాత ఎక్కువ మంది పేటీఎం యూపీఐ యాప్ ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. ఆర్‌బీఐ చర్యల వల్ల కొంత మేర యాప్ వినియోగంపై ప్రభావం పడినా ఇప్పటికీ లక్షల మంది పేటీఎం ద్వారానే డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. మర్చంట్ సేవల్లోనూ పేటీఎం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, తాజాగా కావడంతో ఈ సేవలు సైతం ఆగిపోతాయేమోననే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ విషయంపై పేటీఎం క్లారిటీ ఇచ్చింది. పేటీఎం యాప్, పేటీఎం యూపీఐ, పేటీఎం గోల్డ్ సహా తమ అనుబంధ సంస్థలు అందించే సేవలు క్యూఆర్, సౌండ్ బాక్స్, కార్డ్ మెషీన్లు, పేమెంట్ గేట్ వే, పేటీఎం మనీ వంటి అన్ని రకాల సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా యథావిధిగా పని టేస్తాయని స్పష్టం చేసింది. లైసెన్స్ రద్దుకు కారణాలివే..బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించొద్దని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. డిపాజిటర్లు, ప్రజల ప్రయోజనాలకు మెంట్స్ బ్యాంకును రూల్స్‌కి విరుద్ధంగా నిర్వహిస్తున్నారని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన క్రమంలోనే లైసెన్సును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే డిపాజిటర్లకు చెల్లించేందుకు తగిన నిల్వలు పేటీఎం వద్ద ఉన్నాయని పేర్కొంది.