ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ .. పార్టీని వీడిన ఆరుగురు ఎంపీలలో కనీసం ఐదుగురికి వచ్చే టర్మ్‌లో టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే వారు ఏ కారణం చేతనైనా పార్టీలో సంతోషంగా లేకపోతే ఇప్పుడే రాజీనామా చేయాలనే షరతు పెట్టారని ఈ విషయంపై ప్రత్యక్ష అవగాహన ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇదే విషయంపై చర్చించడానికి శుక్రవారం సాయంత్రం వారిని తన కేజ్రీవాల్ తన ఇంటికి పిలిచారని వర్గాలు పేర్కొన్నాయి. దీనికి ముందు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లతో సహా ఏడుగురు ఎంపీలు పార్టీకి రాజీనామా చేయడంతో ఆప్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంతర్గత వివరాలు వెలుగులోకి వచ్చాయి. తామంతా బీజేపీలో విలీనమైనట్టు రాఘవ్ చద్దా ప్రకటించారు. ఆప్ అధినాయకత్వం పార్టీ సిద్ధాంతాలు, విలువలకు తిలోదకాలు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఆప్‌ను వీడిని మిగతావారిలో హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సహాని, స్వాతి మాలివాల్ ఉన్నారు.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎంపీలతో మాట్లాడుతూ.. ‘‘మీకు ఏమైనా సందేహాలుంటే, మీ పదవులకు రాజీనామా చేయండి, వచ్చే టర్మ్‌లో మీకు మళ్లీ టిక్కెట్లు ఇస్తాం’ అని చెప్పినట్లు తెలిసింది. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరాలని ఎంపీలు గురువారం ఉదయమే నిర్ణయించుకున్నారన్న విషయం కేజ్రీవాల్‌కు తెలియదని పేర్కొన్నాయి.సమావేశానికి కేజ్రీవాల్ నుంచి పిలుపు రాకముందు, ఎంపీలంతా ఒక బృందంగా కలిసి తమ నిష్క్రమణకు ప్రణాళిక రచించలేదని, కానీ, వ్యక్తిగతంగా వారందరూ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని వర్గాలు తెలిపాయి. రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి చద్ధాను తొలగించి.. అశోక్ కుమార్ మిట్టల్‌ను ఉప నియమించిన తర్వాత, ఉమ్మడిగా పార్టీ మారాలనే ఒత్తిడి మొదటి వచ్చింది. ఈ పరిణామం తర్వాతే ఎంపీలను సంప్రదించి వారితో చర్చలు జరిపారని వర్గాలు తెలిపాయి. కానీ అశోక్ మిట్టల్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని వీడారు.యాదృచ్ఛికంగా, మిట్టల్ నివాసంలో ఏడాది పాటు ఉన్న కేజ్రీవాల్ శుక్రవారమే తన కొత్త ఇంట్లోకి మారడం గమనార్హం. ఇక, తమ పార్టీలోకి ఆప్ ఎంపీలకు ఘన స్వాగతం పలికిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్.. వారికి స్వీట్లను తినిపించారు.తమ ఎంపీలు బీజేపీలో చేరడంపై ఆప్ స్పందించింది. వారి ప్రలోభపెట్టడానికి 'ఆపరేషన్ లోటస్'ను బీజేపీ ప్రారంభించిందని, పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అడ్డుకోవడానికి కుట్ర పన్నుతోందని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. అయితే, ఆప్ తన వ్యవస్థాపక సూత్రాలు, సిద్ధాంతాల నుంచి దూరంగా వెళ్లడంతో తాము బీజేపీలో విలీనమయ్యామని మీడియా సమావేశంలో చద్ధా వెల్లడించారు.‘‘ఆప్‌ కోసం 15 ఏళ్లు నా రక్తం, చెమట ధారపోశాను.. సూత్రాలు, విలువలు, మౌలిక నైతికత నుంచి పార్టీ పూర్తిగా పక్కకు తప్పుకుంది’’ అని ఆయన అన్నారు. ‘‘రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీకి చెందిన మొత్తం ఎంపీలలో మూడింట రెండు వంతుల మంది మరో పార్టీలో విలీనం కావచ్చు’’ అని తమ పార్టీలోని 10 మంది ఎంపీల బలాన్ని ప్రస్తావిస్తూ చద్ధా తెలిపారు. ‘‘వారు ఇప్పటికే సంతకాలు చేశారు.. ఈ ఉదయం మేము సంతకాలు చేసిన లేఖలు, ఇతర పత్రాలతో సహా అవసరమైన అన్నింటిని రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించాం’’ అని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంతో పుట్టిన ఆప్.. 14 ఏళ్ల తర్వాత పార్టీ చరిత్రలోనే అత్యంత కఠినమైన సవాళ్లలో ఒకదాన్ని ఎదుర్కొంటోంది.