ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఇవాళ ఉదయం కడుపు నొప్పితో బాధపడ్డారు.. వెంటనే ఆయన తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఉదయం నుంచి చికిత్స అందించగా.. కొద్దిసేటి తర్వాత ఆస్పత్రి నుంచి గవర్నర్‌ విజయవాడ వెళ్లిపోయారు. మణిపాల్ ఆస్పత్రిలో గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.. అయితే అబ్దుల్ నజీర్ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తేలినట్లు తెలుస్తోంది. సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను డాక్టర్లు తొలగించాలని సూచించారు. అయితే తనకు ఇవాళ ముఖ్యమైన పనులు ఉన్నాయని.. మరోసారి ఆసుపత్రికి వస్తానని గవర్నర్‌ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.శుక్రవారం రోజు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ బెంగళూరు నుంచి విజయవాడకు రావాల్సి ఉంది. అయితే బెంగళూరు నుంచి రాత్రి 12 గంటలకు రావాల్సిన విమానం ఆలస్యం కావడంతో.. గవర్నర్ అర్ధరాత్రి రెండు గంటలకు విజయవాడ చేరుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో నజీర్‌ కడుపులో నొప్పితో బాధపడ్డారు. . అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయనకు అపెండిసైటిస్ సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో గవర్నర్‌కు రోబోటిక్ అసిస్టెడ్ అపెండెక్టమీ సర్జరీని నిర్వహించారు. 2024లో కూడా గవర్నర్ అస్వస్థకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో కూడాఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించారు.. అనంతరం ఆయన కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి వెళ్లారు.