టీటీడీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన విడుదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షల ద్వారా ఏఈఈ (సివిల్), ఏఈఈ (ఎలక్ట్రికల్), ఏఈ (సివిల్), ఏటీవో (సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది. 10.05.2026 – ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు - AEE (సివిల్) పరీక్ష నిర్వహిస్తారు. 10.05.2026 – మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు - AEE (ఎలక్ట్రికల్) పరీక్ష ఉంటుంది. 11.05.2026 – ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు - AE (సివిల్) పరీక్ష నిర్వహించనున్నారు. 11.05.2026 – మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు - ATO (సివిల్) పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు వారికి తగిన విధంగా అనువుగా ఉండే ఎగ్జామ్ సెంటర్లను ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవాలని . ఏప్రిల్ 24 నుంచి 29వ తేదీ సాయంత్రం 06.00 గం.ల వరకు పరీక్షా కేంద్రాలను ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ఆ గడువు తర్వాత ఎగ్జామ్ సెంటర్లు మార్చుకోవడానికి, ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచిస్తోంది. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అవసరమైన హాల్‌టికెట్‌ను మే 2వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అలాగే పరీక్షకు సంబంధించిన షిఫ్ట్ వివరాలను పరిశీలించి, అవసరమైన అభ్యర్థి నిర్ధారణ (కాండిడేట్ కన్ఫర్మేషన్) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల వంటి వివరాలను అభ్యర్థులు కాల్ సెంటర్ నెంబర్ 155257ను సంప్రదించాలి. అంతేకాదు టీటీడీ అధికారిక వెబ్ సైట్ అయిన ను సంప్రదించాలని సూచిస్తోంది టీటీడీ. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.