తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో , జెండాను ఆవిష్కరించారు. కొత్త పార్టీ పేరు (TRS) అని ప్రకటించారు. అంతకు ముందు బంజారాహిల్స్‌లోని నివాసంలో కవిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సర్వమత ప్రార్థనల తర్వాత కవిత తన భర్త, కుటుంబసభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం బంజారాహిల్స్‌ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరిన కవిత.. పార్టీ శ్రేణులతో కలిసి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళులర్పించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడిన కవిత.. తెలంగాణలో సరికొత్త విప్లవం రాబోతుందన్నారు. తాను కచ్చితంగా తెలంగాణకు సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు. నిరుపేద, బడుగు, బలహీనవర్గాల గొంతుకనై వారి కోసం పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు.