తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ భక్తులకు అలర్ట్.. పుష్కరణిలో స్నానాలకు అనుమతి.. టైమింగ్స్ ఇవే

Wait 5 sec.

తిరుమల వెళ్లే భక్తులు స్వామివారం ఆలయం సమీపంలో ఉండే పుష్కరణిలో స్నానం ఆచరిస్తుంటారు. వీరిలో అంగప్రదక్షిణ భక్తులు స్వామివారి పుష్కరణిలో స్నానం చేయడానికి వెళుతుంటారు. టీటీడీ తిరుమలలోని పుష్కరణిని రాత్రిసమయంలో పూర్తిగా మూసివేస్తోంది. దీంతో అంగప్రదక్షిణ భక్తులకు ఈ విషయం తెలియక పుష్కరణి వరకు వచ్చి వెనక్కు వెళ్లి వసతి గదుల్లో స్నానాలు చేసి వస్తున్నారు. అంగప్రదక్షిణ భక్తుల ఇబ్బుందుల్ని గమనించిన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి పుష్కరిణిలో అంగప్రదక్షిణ భక్తులు స్నానం చేయడానికి అనుమతించింది. అంగప్రదక్షిణ భక్తుల్ని.. పుష్కరిణి దక్షిణం వైపున ఉన్న ఎస్‌1 గేటు ద్వారా అర్ధరాత్రి 12 గంటల నుంచి స్నానాలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. పుష్కరణిలో స్నానం చేసిన తర్వాత రాత్రి ఒంటిగంటకు వెళ్లి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో రిపోర్టు చేయాలని టీటీడీ వీజీవో సురేంద్ర సూచించారు. సమీపంలోని పుష్కరణిలో సాధారణ భక్తులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు స్నానం చేయొచ్చు.. రాత్రి వేళల్లో టీటీడీ పుష్కరణిని పూర్తిగా మూసివేస్తోంది. పుష్కరణి దగ్గర షవర్లు కూడా ఏర్పాటు చేశారు.. బట్టలు మార్చుకునే వసతి కూడా కల్పించారు. పుష్కరణిలో స్నానం చేసేవారు సబ్బులు, షాంపూలు ఉపయోగించకూడదు.. బట్టలు ఉతకడం, అక్కడే బట్టలు వదిలేసి వెళ్లకూడదు. ప్లాస్టిక్ కవర్లు, పూల మాలలు, ఇతర వస్తువులు నీళ్లో వేయరాదు. ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో పుష్కరణిని శుభ్రం చేస్తారు. దాదాపు నెలపాటూ పుష్కరణి అందుబాటులో ఉండదు, భక్తుల్ని అనుమతించారు. అంగప్రదక్షిణ చేసే భక్తులు పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో వెళతారు. పుష్కరణిలో ఈత కొట్టడం వంటివి చేయకూడదని టీటీడీ భక్తులకు సూచిస్తోంది.తిరుమలలో భాష్యకార్ల సాత్తుమొరతిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడకదారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేశారు. రాత్రి భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.