బహిరంగంగా మద్యపానం, మూత్రవిసర్జన.. FBI చీఫ్ కాష్ పటేల్‌ అరెస్టు.. సంచలన నివేదిక

Wait 5 sec.

ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( FBI) తన యవ్వనంలో రెండుసార్లు అరెస్టు అయ్యానని అంగీకరించారు. ఒకసారి వర్జీనియాలో బహిరంగంగా మద్యం సేవించినందుకు, మరోసారి తాను లా చేస్తున్న సమయంలో న్యూయార్క్‌లోని ఒక బార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బహిరంగంగా మూత్రవిసర్జన చేసినందుకు అరెస్టు అయ్యానని చెప్పారు. ది ఇంటర్‌సెప్ట్ నివేదిక ప్రకారం.. తాను పనిచేసిన మయామి-డేడ్ పబ్లిక్ డిఫెండర్ కార్యాలయంలోని తన వ్యక్తిగత ఫైల్‌లో భాగంగా 2005లో రాసిన ఒక లేఖలో కాష్ పటేళ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘మేము కొన్నిసార్లు స్థానిక బార్లకు వెళ్లి మద్యం సేవించాం’’ అని ఆయన ఆ లేఖలో రాశారు.‘‘ఆ రాత్రి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని, ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ మూత్రవిసర్జన చేయడానికి ప్రయత్నించాను’’ అని ఆ లేఖలో రాశారు. ఈలోగా ఒక పోలీసు వాహనం వచ్చిందని, బహిరంగంగా మూత్రవిసర్జన చేసినందుకు అరెస్టు చేశారని పటేల్ తెలిపారు. ఈ ఆరోపణలను ఖండించారు. ‘‘ఈ విమర్శలు ఆయనను పదవికి అర్హుడిగా ఇప్పటికే నిర్ధారించిన ప్రక్రియను బలహీనపరిచేందుకు చేసే ప్రయత్నం మాత్రమే... అంతేకాకుండా డైరెక్టర్ పటేల్ నాయకత్వంలో ఎఫ్‌బీఐ సాధిస్తున్న రికార్డు స్థాయి విజయాల నుంచి దృష్టి మళ్లించడానికే ఇలా చేస్తున్నారు’’ అని అన్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించడానికి ముందు.. ఆయన నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, తనిఖీ చేశారని నైట్ తెలిపారు.ఈ సంఘటనకు ముందు మైనర్‌గా ఉన్న 2001లో వర్జీనియా రిచ్‌మండ్ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో మద్యం సేవించినందుకు తనను అరెస్టు చేశారని లేఖలో రాశారు. ‘రిచ్‌మండ్ రౌడీస్’అనే పేరుతో విద్యార్థుల అభిమాన బృందం ఏర్పాటుకు పటేల్ సహకరించారు. యూనివర్సిటీ గ్రౌండ్‌లో జరిగిన బాస్కెట్‌బాల్ పోటీలకు హాజరైనప్పుడు ఎక్కువ గోల చేస్తున్నారని ఓ అధికారి తనను బయటకు పంపించారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ‘‘ఆ ప్రాంగణం నుంచి బయటకు వస్తున్నప్పుడు నాకు ఇంకా 21 ఏళ్లు నిండకపోవడంతో బహిరంగంగా మద్యం సేవించానంటూ అధికారి నన్ను అరెస్టు చేశారు’’ అని పటేల్ వివరించారు.తాను కేవలం రెండు పెగ్గులు మాత్రమే తీసుకున్నానని, అరెస్టు అయిన తర్వాత జరిమానా చెల్లించానని ఆయన స్పష్టం చేశారు. ఇంతలో, ఆయన ఒక చిన్న నేరానికి పాల్పడినట్లు రుజువైందని ఎన్‌బీసీ న్యూస్ నివేదించింది. ఆ లేఖ చివరలో పటేల్ క్షమాపణలు చెబుతూ.. ఈ సంఘటనలు తన సాధారణ ప్రవర్తనకు ప్రతీకలు కావని రాశారు. ఇటలీలో అమెరికా ఒలింపిక్ హాకీ జట్టుతో కలిసి బీరు తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావవడంతో.. ఆయన మద్యం సేవించడంపై ఆందోళనలను రేకెత్తించింది.