అభినవ శ్రవణులు.. డోలీపై తల్లిని మోస్తూ 1800 కి.మీ. కాలినడకన కేదార్‌నాథ్‌‌కు తీసుకొచ్చిన కొడుకులు

Wait 5 sec.

ఆరు నెలల శీతాకాలం ముగియడంతో మొదలైంది. ముందుగా గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, చివరిగా బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకున్నాయి. చార్‌ధామ్ యాత్ర కోసం భారీగా తరలివస్తుండగా.. ఆ సన్నివేశం భక్తులను ఆకట్టుకుంది. ఓ ఇద్దరు సోదరులు.. తమ తల్లిని డోలీలో మోసుకుంటూ కేదార్‌నాథ్‌కు తీసుకొచ్చారు. రామాయణంలో శ్రవణ కుమారుడు అంధులైన తన తల్లిదండ్రులను కావిడ కట్టి తీర్థయాత్రలు చేయించినట్టు.. వీరు తమ తల్లిని చార్‌ధామ్ యాత్రకు డోలీలో తీసుకొచ్చి మాతృమూర్తిపై తమ ప్రేమను చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుదౌన్‌కు చెందిన ధీరజ్, తేజ్‌పాల్‌లు.. ఒక్కసారైనా కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించాలనే తమ 60 ఏళ్ల తల్లిని కోరికను తీర్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో తమ తల్లిని తీసుకుని సోదరులు ఇద్దరూ చార్‌ధామ్ యాత్రకు బయలుదేరారు. ఆమెను డోలీలో కూర్చోబెట్టి క్లిష్టమైన మార్గాల్లో దాదాపు 1,800 కి.మీ నడుచుకుంటూ కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకున్నారు. బుదౌన్ నుంచి కేదార్‌నాథ్‌ చేరుకోవడానికి తమకు 3 నెలల 24 రోజులు పట్టిందని చెప్పారు. కేదార్‌నాథ్‌ను దర్శించుకోవాలనేది తమ తల్లి జీవితకాల కోరికని వారు చెప్పారు. అయితే, ప్రస్తుత కాలంలోనూ ఇలా తల్లి పట్ల అవిభాజ్యమైన ప్రేమను చూపించి, ఆమె కోరికను తీర్చడం కోసం కావిడకట్టి భుజాన మోసుకుంటూ వచ్చిన ఈ యువకులపై ప్రశంసలు కురుస్తున్నాయి. కాలినడకను వందల కిలోమీటర్లు నడిచి సాహసం చేసిన ఈ సోదరులను ఆభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా, దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్ 19న చార్‌ధామ్‌ యాత్ర మొదలయ్యింది. ఆరు నెలల శీతాకాలం తర్వాత అక్షయ తృతీయ నాడు ఉత్తర కాశీ జిల్లాలోని గంగోత్రి.. తర్వాత యమునోత్రి ఆలయాలు తెరుచుకోవడంతో యాత్ర ప్రారంభమైంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అయితే, సనాతనులు కానివారు పంచగవ్య ( పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, పేడ మిశ్రమం)ను సేవించాలనే నిబంధనను గంగోత్రి ఆలయ కమిటీ తప్పనిసరిగా విధించింది. అలాగే, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌‌లో మాత్రం హిందూయేతరులు సనాతన ధర్మంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అఫిడవిట్‌ సమర్పించాల్సి ఉంటుంది.