ఎస్బీఐ నుంచి అతిపెద్ద ఐపీఓ వచ్చేస్తుంది.. టార్గెట్ రూ. 14 వేల కోట్లు.. ఇక రోడ్‌షో షురూ..!

Wait 5 sec.

Roadshow: స్టాక్ మార్కెట్లలో ఎక్కువగా ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టాలని చూస్తుంటారు. చాలా వరకు ఐపీఓలు.. లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువగా ఇస్తుంటాయి. ఏదైనా కంపెనీ తొలిసారిగా షేర్ల విక్రయం ద్వారా నిధుల్ని సమీకరించడాన్ని ఐపీఓగా చెబుతారు. ఇంకా ప్రముఖ సంస్థ నుంచి వచ్చే ఐపీఓలకు డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సబ్‌స్క్రిప్షన్ కోసం ఇన్వెస్టర్లు ఎగబడుతుంటారని చెప్పొచ్చు. అందుబాటులో ఉన్న షేర్ల కంటే ఎన్నో రెట్ల మేర షేర్లకు బిడ్స్ దాఖలవుతుంటాయి. అదే రీతిలో మంచి ప్రీమియంతో లిస్టింగ్ కూడా అవుతుంటాయి. ఇప్పుడు పలు ప్రముఖ కంపెనీలు 2026లో ఐపీఓ కోసం లైన్‌లో ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో . ఇక్కడ మరో పెద్ద సంస్థ నుంచి కూడా ఐపీఓ రాబోతుంది. అదే ఎస్బీఐ సబ్సిడరీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ విభాగమైన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్. ఈ ఏడాదిలోనే లిస్టింగ్ కావాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అతిత్వరలోనే ఐపీఓ ప్రాసెస్ ప్రారంభించనుంది. ముందుగా మార్కెటింగ్ ప్రక్రియను వచ్చే వారంలోనే ప్రారభించనుంది. ఐపీఓతో సుమారు 1.5 బిలియన్ డాలర్ల మేర నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారత కరెన్సీలో చూస్తే సుమారు రూ. 14 వేల కోట్లకుపైనే ఉంటుంది. ప్రీ ఐపీఓ షేర్ ప్లేస్‌మెంట్ ద్వారానే సుమారు 350 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3 వేల కోట్లకుపైగా) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని గురించి ప్రస్తుతం మర్చంట్ బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎస్బీఐ ఫండ్స్ వాల్యుయేషన్ దాదాపు 13-15 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది రూ. 1.22 లక్షల కోట్ల నుంచి రూ. 1.41 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇది విలువలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్‌తో పోటీపడనుంది. దాని మార్కెట్ విలువ 17.6 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో చూస్తే ఇది రూ. 1.65 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్.. ఐపీఓ కోసం 9 మర్చంట్ బ్యాంకర్లను నియమించుకుంది. ఇందులో కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్ లిమిటెడ్ వంటివి ఉన్నాయి. ఎస్బీఐ రోడ్‌షో..ఇక మార్కెటింగ్‌లో భాగంగా.. ఎస్బీఐ రోడ్‌షో నిర్వహించనుంది. రోడ్ షో అంటే.. కంపెనీ షేర్ మార్కెట్లోకి వచ్చేందుకు ముందు.. పెద్ద పెట్టుబడిదారుల్ని ఆకర్షించేందుకు నిర్వహించే మార్కెటింగ్ కార్యక్రమం. సులభంగా చెప్పాలంటే.. కంపెనీ తన షేర్లను అమ్ముకునేందుకు చేసే ప్రచారం అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ప్రెజెంటేషన్స్ ఇస్తారు. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు, ఆర్థిక స్థితిగతులు, మేనేజ్మెంట్ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ సమావేశాల ద్వారా మార్కెట్లో.. ఐపీఓకు డిమాండ్ పెంచుతారు. పెట్టుబడిదారుల సందేహాల్ని నివృత్తి చేసి వారిలో నమ్మకం కల్పిస్తారు. ఇంకా పెద్ద పెట్టుబడిదారుల నుంచి నిధుల్ని సమీకరిస్తారు.