ట్యాక్స్ పేయర్లకు బిగ్ రిలీఫ్.. ITR గడువు దాటినా నో పెనాల్టీ.. ఐటీఏటీ కీలక తీర్పు!

Wait 5 sec.

ITR Deadline: డిజిటల్ ట్యాక్స్ వ్యవస్థతో ఇబ్బందులు పడుతున్న ట్యాక్స్ పేయర్లకు భారీ ఊరట లభించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ITAT) జైపూర్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. జైపూర్‌కు చెందిన ఓ ట్యాక్స్ పేయర్ ఐటీ రిటర్నులు ఫైల్ చేయడంలో సరైన డిజిటల్ నాలెడ్జ్ లేక, ఆన్‌లైన్ ప్రొసీజర్ గురించి తెలియగా 600 రోజుల పాటు జాప్యం చేసిన కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. సదరు పన్ను చెల్లింపుదారుడికి రెండో అవకాశం ఇచ్చింది. కిషాన్ లాల్ మీనా వర్సెస్ ఐటీఓ టెక్నికల్, ప్రొసీజరల్ లిమిటెషన్స్ కారణంగా ట్యాక్స్ పేయర్లకు సేవలను నిరాకరించవద్దని తెలిపింది. డిజిటల్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఐటీ రిటర్నులు లేదా నోటీసులకు స్పందించే గడువును మించిపోతే దానిని ఒక చెల్లుబాటు అయ్యే కారణంగా పరిగణించవచ్చని ఐటీఏటీ స్పష్టం చేసింది.ఈ కేసు అసెస్మెంట్ ఇయర్ 2009-10కు సంబంధించినది. సదరు వ్యక్తి రూ.15.75 లక్షలు క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్లు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేసినా ఎలాంటి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేయలేదని గుర్తించి సెక్షన్ 148, సెక్షన్ 142(1) కింద నోటీసులు పంపించింది. ఎలాంటి సరైన వివరణ లేదని అసెసింగ్ ఆఫీర్ తేల్చారు. సెక్షన్ 69సీ కింద మొత్తం ట్రాన్సాక్షన్‌ పన్ను ఎగవేత కిందకు వస్తుంది నిర్ణయించారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించనందున అసెస్సీ చెప్పేందుకు ఇంకా ఏం లేదని నోటీసులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సదరు ట్యాక్స్ పేయర్లు కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీల్స్ ను ఆశ్రయించారు. ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించలేదనే కారణంగా అప్పీల్‌ను సీఐటీఏ కొట్టేసింది. ఐటీ అధికారుల నిర్ణయాన్ని సమర్థించింది. ఆ తర్వాత ఈ కేసు ITAT వద్దకు చేరింది. అయితే అప్పీల్ చేసుకునేందుకు 631 రోజుల జాప్యం జరిగడం గమనార్హం. కేసు విచారణ సందర్భంగా తాను 12వ తరగతి మాత్రమే చదివానని, తనకు కంప్యూటర్ పరిజ్ఞానం లేదని, ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్ గురించి తెల్వదని,డిజిటల్ నోటీసులకు ఎలా స్పందించాలో తెలియదని తెలిపారు. అప్పీల్ చేసుకునేందుకు జాప్యం జరగడం అనేది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, తనకు డిజిటల్, టెక్నికల్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల జరిగినట్లు తెలిపారు. ట్యాక్స్ పేయర్ పరిస్థితిని గమనించిన ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. జాప్యం జరిగిందన్న కారణంతో మరో అవకాశం కల్పించకపోవడం అనేది సరైన నిర్ణయం కాదని తెలిపింది. ట్యాక్స్ పేయర్ల హక్కులను, తమ వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా అణచివేయకూడదని తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత 631 రోజుల జాప్యాన్ని మన్నించి పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ ట్రైబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసును అసెస్మెంట్ ఆఫీర్ వద్దకు పంపించింది. తిరిగి రెండో ఛాన్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే విచారణకు సహకరించాలని, అనవసరమైన వాయిదాలను నివారించాలని పన్ను చెల్లింపుదారుకు సూచించింది. అదే డిజిటల్ నిబంధనలను పాటించడం, పన్ను చెల్లింపుదారుల మధ్య అవగాహన రాహిత్యం వంటివి ప్రధానంగా ఉన్నాయి. పన్ను వ్యవస్థ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోకి మారిపోయినప్పుడు చాలా మంది ట్యాక్స్ పేయర్లకు ముఖ్యంగా చిన్న పట్టణాల ప్రజలు, సరైన చదువు లేని వారికి ట్యాక్స్ నోటీసులను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్ ను ఉపయోగించలేకపోతున్నారు. విధానపరమైన లాపాల కారణంగా సహజ న్యాయాన్ని అది మించకూడదని ఈ తీర్పు పునరుద్ఝాటిస్తుంది.