వివాదంలో రబాడ.. సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన పేసర్..!

Wait 5 sec.

గుజరాత్ టైటాన్స్ పేసర్, దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రాబాడ.. సిగరెట్ తాగుతూ కెమెరా కంటికి చిక్కాడు. ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ఈ ప్రొటీస్ పేసర్.. జట్టు సిబ్బందితో కలిసి ఒక హోటల్ ప్రాంగణంలో సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హోటల్‌లోని బాల్కనీ నుంచి ఓ వ్యక్తి ఈ దృశ్యాలను రికార్డు చేశాడు.కాగా ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌లో స్మోకింగ్‌పై స్పష్టమైన నిషేధం లేదు. అంటే సిగరెట్ తాగడం నిబంధనలకు వ్యతిరేకం కాదు. అయితే ఆటగాళ్ల ఫిట్‌నెస్, ప్రొఫెషనల్ ప్రవర్తన దృష్ట్యా రబాడ చేష్టలు విమర్శలు దారితీస్తోంది. ఒక ప్రముఖ అంతర్జాతీయ అథ్లెట్‌ అయిన రబాడ.. ఇలా బహిరంగ ప్రదేశాల్లో స్మోక్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కాగా రబాడాకు గతంలో డోపింగ్ ఉల్లంఘన నేపథ్యం ఉన్నందున ఈ ఘటనను బీసీసీఐ యాంటీ-డోపింగ్ విభాగం ఈ విషయంపై దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అతడు వాడింది కేవలం సిగరెట్ మాత్రమేనా? లేక మరేదైనా నిషేధిత పదార్థమా? అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది.గతంలో సౌతాఫ్రికా టీ20 లీగ్ సందర్బంగా డోపింగ్ పరీక్షల్లో రబాడ విఫలమయ్యాడు. దీంతో అతడు ఏప్రిల్ 1 నుంచి మే 1, 2025 వరకు జట్టుకు దూరమయ్యాడు. ఫలితంగా ఐపీఎల్ సీజన్‌లోని చాలా మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. ఆ తర్వాత సుదీర్ఘ నిషేధాన్ని తప్పించుకుని.. మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. కాగా రబాడ చర్యలను కొందరు సమర్థిస్తున్నారు. సిగరెట్ తాగడం అనేది పెద్ద నేరమేమీ కాదని పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం రోల్‌మోడల్‌గా ఉండాల్సిన క్రీడాకారులు.. మైదానంలో, మైదానం వెలుపలా హుందాగా ఉండాలని సూచిస్తున్నారు.ఇక ఐపీఎల్ 2026లో రబాడ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్‌ ఆడిన 6 మ్యాచ్‌లలో 3 విజయాలు, 3 ఓటములతో ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.