ఏపీ సచివాలయ చేయటం.. అధికార, విపక్షాల మధ్యన మాటల యుద్ధానికి దారితీస్తోంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కాండక్ట్ రూల్స్‌కు విరుద్ధంగా వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారనే చేసింది. ఆయనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నిలుపుదల చేసింది. దీనిపై స్పందించిన వైసీపీ అధినేత అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న అశో‌క్ బాబు.. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్‌కు కౌంటరిచ్చారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ బాబు. వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది వైసీపీ ప్రభుత్వమేనని అశోక్‌ బాబు తెలిపారు. 2024లో కాకర్ల వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసినప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమేనని అశోక్ బాబు తెలిపారు. అప్పటి నుంచే వెంకట్రామిరెడ్డిపై చర్యలు ప్రారంభమయ్యాయన్న ఆయన.. 2024 ఎన్నికలలో వెంకట్రామిరెడ్డి వైసీపీ తరుఫున ప్రచారం చేసినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. బద్వేల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వెంకట్రామిరెడ్డి మీద అప్పట్లోనే నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్లు వెల్లడించారు. ఆగస్టులో జరిగిన విచారణలో వెంకట్రామిరెడ్డి మీద వచ్చిన ఆరోపణలు నిజమని తేలటంతోనే డిస్మిస్ చేసినట్లు తెలిపారు. వైఎస్ జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. కాకర్ల వెంకట్రామిరెడ్డి కుటుంబమంతా వైసీపీ కార్యకర్తలేనన్న అశోక్ బాబు.. వెంకట్రామిరెడ్డి భార్య ముషీరాబాద్ టికెట్ అడగటం నిజం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని.. ఎల్వీ సుబ్రమణ్యం, ఏబీ వెంకటేశ్వరరావు వంటి ఆఫీసర్లను వేధించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చిన ఘనత వైసీపీది, వైఎస్ జగన్‌‍ది అంటూ అశోక్ బాబు మండిపడ్డారు. కూటమి సర్కారు నిబంధనల ప్రకారం, ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగిస్తోందని.. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని అశోక్ బాబు స్పష్టం చేశారు.