పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం.. ఏపీలో గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశమైన వ్యవహారం.. వ్యక్తం చేస్తోంది. ఈ విధానం ద్వారా ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేసే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. అలాగే పేదలకు వైద్యం అందకుండా పోతుందంటూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టింది. స్పష్టం చేస్తోంది. పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలలో ప్రమాణాలను పెంచటంతో పాటుగా.. సీట్లు పెంపుదల చేపట్టవచ్చని చెప్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది.మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల కోసం టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తొలి విడతలో భాగంగా 4 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీల పనులు మొదలు పెట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రెండో విడతలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఏడు ప్రధానమైన అంశాలతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ 2026-31 తీసుకురావాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. తొలి దశలో పులివెందుల మెడికల్ కాలేజీ పనులుమరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధునాతన సౌకర్యాలతో పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోంది. అయితే పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించకపోవటంతో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు నిలిపివేశారు. జాతీయ వైద్య మండలి అనుమతి ఉపసంహరించుకోవటం అప్పట్లో రాజకీయ రచ్చకు కారణమైంది. ఈ నేపథ్యంలో నెలలోపు మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.