ఆయిల్ కంపెనీలపై చంద్రబాబు సీరియస్.. అనుమతులపై పునరాలోచించాల్సి వస్తుందని వార్నింగ్..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల వేధిస్తోంది. ప్రభుత్వం కొరత లేదని చెప్తున్నప్పటికీ పలుచోట్ల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్ కంపెనీల ప్రతినిధులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం లోపు పెంచాలని ఆయిల్ కంపెనీలకు సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని.. రేపటికల్లా సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆదేశించారు. సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఇంధన డిమాండ్ ఒక్కసారిగా పెరిగినట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. పెట్రోల్ డిమాండ్ 34 శాతం పెరిగిందని.. డీజిల్ వినియోగం పెరిగిందని వివరించారు. పెట్రోల్ బంకులకు క్రెడిట్ సౌకర్యం నిలిపివేత, ఆయిల్ సరఫరా నిలిపివేత కారణంగా సమస్య ఎక్కువైందని సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ఆయిల్ కంపెనీలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకులకు క్రెడిట్ ఫెసిలిటీ ఎందుకు ఆపివేశారని ప్రశ్నించారు. చమురు సంస్థల అసంబద్ధ నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడితే.. ఆయిల్ కంపెనీల అనుమతులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే సమస్యను ముందే గుర్తించి ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ సమస్య పరిష్కారానికి టాస్క్ ఫోర్స్‌, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. పెట్రోల్ బంకుల వద్ద పోలీస్ బందోబస్తు, రెవెన్యూ అధికారులతో పాటుగా సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేయాలని ఆదేశించారు. వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా చూడాలని.. రైతులు ఇబ్బందులు పడకుండా కూపన్ విధానం అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. సోమవారం నాటికి పెట్రోల్ బంకుల వద్ద నోస్టా్క్ బోర్డులు కనిపించకూడదని.. చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్లకు తరలకుండా చర్యలు తీసుకోవాలని.. ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు తరలించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.