రాష్ట్రంలోని రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం అమలు చేయనుంది. రైతుల కోసం రేపటి నుంచి ( ఏప్రిల్ 27) పేరుతో కార్యక్రమం చేపట్టనుంది. మే 23వ తేదీ వరకూ తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి వెల్లడించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలలో పర్యటించనున్నారు. ఇందుకోసం వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలతో కలిసి 200 బృందాలను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ బృందాలు గ్రామాలలో పర్యటించి రైతులతో సమావేశం కానున్నాయి.ఈ సందర్భంగా గ్రామాల్లోని రైతులకు వివిధ అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. అందుకు అవసరమైన శిక్షణ కూడా అందిస్తారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు, సాగునీటి పొదుపు, ఎరువుల వినియోగం, యూరియా వాడకాన్ని తగ్గించటం వంటి అంశాలపై ఈ సందర్భంగా ప్రత్యేక దృష్టి సారిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో రైతులకు పంపిణీ చేయడానికి 8 రకాల వరి వంగడాలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలనే రైతులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ సోన, బీపీటీ 5204, జైశ్రీరాం, KNM 1638, HMT, WGL 44, TGC 1798, WGL 962 రకాలను రైతులకు అందించనున్నారు. వానాకాలం ప్రారంభానికి ముందే రైతులకు విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తెలంగాణపై ఎల్ నినో ప్రభావంమరోవైపు తెలంగాణ మీద ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంచనా వేశారు. ఎల్ నినో కారణంగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో పండే నూనె గింజలు, ఆయిల్ పామ్, పప్పుధాన్యాల సాగు వైపు రైతులు ఆలోచనలు చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా.. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తూ పంటల సాగు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు.