టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఆదివారం అర్ష్‌ ఔలఖ్‌ను ఆమె పెళ్లాడారు. ఏప్రిల్ 26న జరిగిన తన వివాహ వేడుకకు సంబంధించిన విశేషాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ, కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు ఆమె ప్రకటించారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మెహ్రీన్.. ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌‌తో ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరుగుతుందని అంతా అనుకుంటున్న తరుణంలో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. తనకు మెహ్రీన్‌కి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా పరస్పర అంగీకారంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నామని భవ్య బిష్ణోయ్‌‌ తెలిపారు. నాలుగేళ్ల తర్వాత మెహ్రీన్ ఇప్పుడు అర్ష్‌ ఔలఖ్‌ని పెళ్లి చేసుకొని వివాహ బంధంలో అడుగుపెట్టారు.