జనసేన నాయకుల వలనే పవన్ కళ్యాణ్‌కు అనారోగ్యం.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మరో వారం, పది రోజుల తర్వాత ప్రజా కార్యక్రమాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అనారోగ్యంపై జనసేన ఎమ్మెల్యేసంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై జనసేన పార్టీ కూడా త్రిసభ్య కమిటీ ద్వారా విచారణ చేయించింది. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతున్న సమయంలోనే సోషల్ మీడియా ద్వారా బాధితురాలు రోజుకో వీడియో విడుదల చేస్తున్నారు. తాజాగా మరో వీడియో విడుదల చేసిన ఆమె.. జనసేన నేతలు అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్రపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురికావడానికి పవన్ కళ్యాణే కారణమని ఆరోపించారు. అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిందన్న బాధితురాలు.. త్రిసభ్య కమిటీ నివేదిక రాకముందే అరవ శ్రీధర్ జనసేన కండువాలు కప్పుకుని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ఈ విషయంపై తాను ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా అరవ శ్రీధర్ అలాగే వ్యవహరిస్తున్నారంటే జనసేన నుంచి ఆయనకు క్లీన్ చిట్ ఏమైనా వచ్చిందేమోనని సందేహం వ్యక్తం చేశారు... దాడి చేస్తే సైలెంట్‌గా ఉండిపోతానని అనుకోవటం భ్రమేనని అన్నారు. ఇంకోసారి తనపై దాడి చేయడానికి వస్తే.. నోటితో కాదు చేయితో సమాధానమిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి పరువు పోగొట్టుకునే పని చేయవద్దని హితవు పలికారు.మరోవైపు అరవ శ్రీధర్ వంటి జనసేన నాయకుల వలనే పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారని బాధితురాలు ఆరోపించారు. జనసేన నాయకులు వివాదాల్లో చిక్కుకుని బలహీనులుగా మారుతుంటే.. వారిని పార్టీలో నుంచి తీసేయలేక, పార్టీ పరువు పోతోందనే మానసిక ఒత్తిడితో, మనస్తాపంతో పవన్ కళ్యాణ్ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలు, జనసేన నేతలు, కార్యకర్తలు వెన్నుపోటు పొడిస్తే ఎవరికీ చెప్పుకోలేక.. మనస్తాపంతో పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారని అన్నారు. పవన్ కళ్యాణ్ కోసం జనసేన నేతలు మృత్యుంజయ హోమాలు చేయాల్సిన అవసరం లేదని.. ఆయన మాట పాటిస్తే చాలంటూ సలహా ఇచ్చారు. పార్టీకి నమ్మకంగా, నిజాయతీగా ఉండకుండా చేసే పనులన్నీ చేసేసి.. తీరిగ్గా పవన్ కళ్యాణ్‌కు పాలాభిషేకం చేస్తే అవన్నీ పోతాయా అంటూ బాధితురాలు వీడియోలో ప్రశ్నించారు.